Vijay Deverakonda: విజయ్ దేవరకొండకు కు క్లీన్ హిట్ పడి చాలా కాలం అవుతుంది. ఆయన గత చిత్రం ఖుషి కూడా పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేదు. యావరేజ్ గా నిలిచింది. దీంతో తనకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడితో చేతులు కలిపాడు. దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన గీత గోవిందం భారీ విజయం సాధించింది. విజయ్ దేవరకొండకు స్టార్ ఇమేజ్ తెచ్చిన చిత్రం అది. అమ్మాయిల్లో విజయ్ దేవరకొండకు హ్యూజ్ ఫాలోయింగ్ వచ్చింది. ఆ మూవీలో రష్మిక మందాన-విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ అద్భుతం అనాలి.
పరశురామ్-విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న రెండో చిత్రం ఫ్యామిలీ స్టార్. టైటిల్ తోనే దర్శకుడు ఆలోచింపజేశాడు. ఫ్యామిలీ స్టార్ ప్రోమోలు, సాంగ్స్ ఇప్పటికే ఆకట్టుకున్నాయి. సినిమా మీద పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశాయి. చిత్ర విడుదల సమయం దగ్గరపడుతుండగా ప్రమోషన్స్ జోరు పెంచారు. నేడు చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. రెండున్నర నిమిషాల ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
కామెడీ, రొమాన్స్, ఎమోషన్, యాక్షన్ కలగలిపి ఫుల్ మీల్ సిద్ధం చేశాడని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. మృణాల్ ఠాకూర్-విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ ట్రైలర్ కే హైలెట్ అని చెప్పాలి. సినిమాలో కూడా వీరిద్దరి కాంబినేషన్ సీన్స్ అద్భుతంగా ఉండే సూచనలు కలవు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ పాత్రలో షేడ్స్, లుక్స్ మెప్పించాయి. ఫారిన్ ఎపిసోడ్ కూడా ఉన్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. ట్రైలర్ చివర్లో మృణాల్ విజయ్ దేవరకొండ చెంప పగలగొట్టిన సందర్భం బాగుంది.
మొత్తంగా చెప్పాలంటే ఫ్యామిలీ స్టార్ పక్కా యూత్ ఫుల్ మూవీ. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడే అంశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. విజయ్ దేవరకొండకు ఫ్యామిలీ స్టార్ రూపంలో హిట్ పక్కా అనిపిస్తుంది. ఇక మృణాల్ తెలుగులో చేసిన సీతారామం, హాయ్ నాన్న విజయం సాధించాయి. ఫ్యామిలీ స్టార్ తో ఆమె హ్యాట్రిక్ పూర్తి చేయవచ్చు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఫ్యామిలీ స్టార్ నిర్మించారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న విడుదల కానుంది.