Vijay Deverakonda: సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఆయన చేసిన ప్రతి సినిమా కూడా పెద్దగా ప్రభావితం చూపించలేక పోతుంది. దానివల్లే ఆయన టైర్ వన్ హీరోగా మారుతాడు అనుకున్న కూడా టైర్ 2 హీరో గానే మిగిలిపోవాల్సి వచ్చింది.
ఇక ఇప్పుడు పరుశురాం డైరెక్షన్ లో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే చాలా కసరత్తులను కూడా చేస్తూ ఆ సినిమా కోసం ఎలాంటి ఇబ్బందిని అయిన ఎదుర్కొంటున్నాడు… నిజానికి అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ గా ఎదిగే వాడు కానీ ఓవర్ ఆటిట్యూడ్ చూపించడం వల్ల ప్రేక్షకుల్లో ఆయన మీద ఒక నెగిటివ్ ఫీలింగ్ అయితే ఏర్పడింది. దానివల్ల ఆయన్ని ఇష్టపడిన వాళ్లు కూడా అతనంటే ఇంట్రెస్ట్ చూపించకుండా పోయారు.
ఇక స్టేజ్ మీద ఆయన ఓవర్ గా మాట్లాడడాలు, వాళ్ల మీద వీళ్ళ మీద పంచులు వేయాడాలు ఇలాంటివి చేసే తన కెరియర్ ని తను కోల్పోయాడు అని చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఇప్పుడు తను కొంచెం తగ్గి అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ ముందుకి కదిలితే మాత్రం ఆయన స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపును సంపాదించుకుంటాడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ప్రస్తుతం ఆయన పరశురాం డైరెక్షన్ లో చేస్తున్న ఫ్యామిలీ స్టార్ అలాగే గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో చేస్తున్న సినిమాలు సూపర్ సక్సెస్ లు సాధిస్తే ఆయన మరోసారి స్టార్ హీరోగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందుతాడు. లేకపోతే మాత్రం ఆయన కెరీయర్ అనేది చాలా డౌన్ ఫాల్ అవుతుంది అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…