Homeఎంటర్టైన్మెంట్Family Star Teaser: ఫ్యామిలీ స్టార్ టీజర్ రివ్యూ: అమ్మాయిలకు అస్సలు టెంప్ట్ కాని విజయ్...

Family Star Teaser: ఫ్యామిలీ స్టార్ టీజర్ రివ్యూ: అమ్మాయిలకు అస్సలు టెంప్ట్ కాని విజయ్ దేవరకొండ!

Family Star Teaser: విజయ్ దేవరకొండ-పరశురామ్ లది హిట్ కాంబినేషన్. గీత గోవిందం రికార్డులు బద్దలు కొట్టింది. భారీ లాభాలు పంచిన చిత్రాల జాబితాలో నిలిచింది. రష్మిక మందాన(Rashmika Mandanna), విజయ్ దేవరకొండ జంటగా నటించిన గీత గోవిందం విజయ్ కి భారీ ఇమేజ్ తెచ్చిపెట్టింది. రెండోసారి వారు ఫ్యామిలీ స్టార్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దిల్ రాజు నిర్మాతగా ఫ్యామిలీ స్టార్ తెరకెక్కింది. ఈ మూవీ విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేశారు. ఫ్యామిలీ స్టార్ టీజర్ విడుదల చేశారు.

ఈ మూవీలో విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంది. ఆయన పక్కా ఫ్యామిలీ మెన్ గా కనిపిస్తున్నాడు. మొదటి టీజర్ లో విజయ్ దేవరకొండ చెప్పిన ఓ డైలాగ్ విపరీతంగా వైరల్ అయ్యింది. ఐరనే వంచాలా ఏంటి… అనే డైలాగ్ ని నెటిజెన్స్ ట్రోల్ చేశారు. దాన్ని కూడా ప్రచారానికి వాడేశాడు విజయ్ దేవరకొండ. ట్రోల్ పై స్పందించి సినిమాకు ప్రచారం తెచ్చుకున్నాడు. తాజాగా ఫ్యామిలీ స్టార్ నుండి మరో టీజర్ వదిలారు.

విజయ్ దేవరకొండను కొత్తగా చూపించాలి అంటే అది పరుశురామ్ కే సాధ్యం అన్నట్లు టీజర్ ఉంది. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. చివర్లో మృణాల్ డ్రాప్ చేయమంటే… లీటర్ పెట్రోల్ కొట్టిస్తే డ్రాప్ చేస్తానని చెప్పడం బాగుంది. హీరో బహుశా బడ్జెట్ పద్మనాభం వలె ఉంటాడేమో. ఏది ఏమైనా ఫ్యామిలీ మాన్ టీజర్ ఆకట్టుకుంది. సినిమా మీద అంచనాలు పెంచేసింది. విజయ్ దేవరకొండ నుండి ఒక మంచి రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ డ్రామా వస్తుందని అనిపిస్తుంది.

విజయ్ దేవరకొండతో మృణాల్ మొదటిసారి జతకట్టింది. మృణాల్ తెలుగులో నటించిన రెండు చిత్రాలు హిట్. సీతారామం, హాయ్ నాన్న మంచి విజయం సాధించాయి. ఫ్యామిలీ స్టార్ తో హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి. విజయ్ దేవరకొండ గత చిత్రం ఖుషి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. వరల్డ్ ఫేమస్ లవర్, డియర్ కామ్రేడ్ చిత్రాలు ఫెయిల్ అయ్యాయి. దాంతో ఫ్యామిలీ స్టార్ మీద విజయ్ ఆశలు పెట్టుకున్నాడు.

Family Star Teaser - Vijay Deverakonda | Mrunal Thakur | Parasuram | Dil Raju | Gopisundar

Exit mobile version