Vijay Deverakonda Kingdom movie: కొంతమంది హీరోలకు కొన్ని సినిమాలు కచ్చితంగా హిట్ అవ్వాలి, లేదంటే మనుగడ సాగించడం కష్టం. హీరో నితిన్(Hero Nithin) అలాంటి పరిస్థితిలోనే మొన్నటి వరకు ఉండేవాడు, తమ్ముడు చిత్రం ఆయనకు కచ్చితంగా సక్సెస్ ఇస్తుందని అనుకున్నాడు, కానీ ముందు చిత్రాలకంటే ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది. ఇప్పుడు ఆయన మార్కెట్ పూర్తిగా పోయినట్టే, ప్రస్తుతం మరో యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) పరిస్థితి కూడా అంతే. అర్జున్ రెడ్డి చిత్రం తో భారీ కమర్షియల్ హిట్ ని అందుకొని ఓవర్ నైట్ యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించినుకున్న విజయ్ దేవరకొండ, ఆ తర్వాత ‘గీత గోవిందం’ తో మరో భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంకొక్క హిట్ కొడితే విజయ్ దేవరకొండ కి తిరుగు ఉండదు, స్టార్ హీరోల లీగ్ లోకి వచేస్తాడని అంతా అనుకున్నారు.
Also Read: జూనియర్ ఫుల్ మూవీ రివ్యూ… హిట్టా?ఫట్టా?
కానీ అలాంటిదేమి జరగలేదు, ‘గీత గోవిందం’ తర్వాత ఆయన హీరో గా నటించిన ప్రతీ సినిమా కమర్షియల్ గా ఒక దానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చాయి. దీంతో విజయ్ దేవరకొండ కెరీర్ పరిస్థితి డైలామా లో పడింది. ఇప్పుడు కచ్చితంగా ఆయన ‘కింగ్డమ్'(Kingdom Movie) చిత్రం తో సూపర్ హిట్ అని అందుకోవాల్సిందే. గౌతమ్ తిన్ననూరి(Gowtham Tinnanuri) దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో చివరిదశలో ఉంది. ఈ నెల 31 న ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఎదో పర్వాలేదు అనే రేంజ్ లోనే ఆ అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నాయి కానీ, అనుకున్నంత లేవు. విజయ్ దేవరకొండ కి ఈ చిత్రం కచ్చితంగా ఒక అగ్ని పరీక్ష లాంటిది. ప్రస్తుతం ఆయన శ్యామ్ సింగ రాయ్ డైరెక్టర్ రాహుల్ తో ఒక చిత్రం చేస్తున్నాడు. ఇది భారీ బడ్జెట్ సినిమా.
Also Read: 50 ఏళ్ల వయసులో 20 ఏళ్ల లుక్, మాధవన్ గ్లామర్ సీక్రెట్ ఇదే!
షూటింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టుకొని కొంతభాగం వరకు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ప్రస్తుతానికి ఆపేశారట. ‘కింగ్డమ్’ మూవీ ఫలితాన్ని చూసిన తర్వాతనే సినిమా షూటింగ్ ని మళ్ళీ మొదలు పెడుదాం అనే ఉద్దేశ్యంతో ఉన్నాడట ఆ చిత్ర నిర్మాత. చూసారా ఎంత పెద్ద కష్టమొచ్చిందో. అయితే ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ చాలా కష్టపడ్డాడని అంటున్నారు. సినిమాలో అనేక రియల్ స్టంట్స్ ని ఆయన డూప్ లేకుండా చేశాడట. అందులో ఆయన చేసిన ఒక స్టంట్ ఎలా ఉండబోతుందో చూపిస్తూ సోషల్ మీడియా లో ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది. రెండు గోడల మధ్య కాళ్ళు పెడుతూ అలాగే పైకి ఎక్కుతూ విజయ్ దేవరకొండ చేసిన ఈ స్టంట్ ఆడియన్స్ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. అయితే చాలా మంది ఇందులో ఉన్నది విజయ్ దేవరకొండ కాదని అంటున్నారు. దీనిపై మూవీ టీం మాత్రమే క్లారిటీ ఇవ్వగలదు.
#Kingdom lo vijay stunts elane vuntayi anta ni dedication ki hat’s off anna @TheDeverakonda #KingdomOnJuly31st #VijayDevarakonda pic.twitter.com/q7zRIAAvJV
— Dragon (@Bharath111NTR) July 17, 2025