Vijay Deverakonda Rashmika Wedding Date: అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ…ప్రస్తుతం డిఫరెంట్ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా రవికిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్ధన్ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా మరికొన్ని సినిమాలకు కూడా కమిట్ అయ్యాడు. విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాలన్నీ అతనికి గొప్ప విజయాలను సాధించి పెట్టే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఆచితూచి మరి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు… ఇక విజయ్ దేవరకొండ గీతా గోవిందం సినిమాలో రష్మిక మందాన తో కలిసి నటించాడు. వీళ్ళిద్దరికి అప్పట్లో మంచి ఫ్రెండ్షిప్ కుదిరిందని వాళ్లే ఓపెన్ గా చెప్పారు.
దాంతో వీళ్ళిద్దరూ తరచుగా వీడియోలో కనిపిస్తూ ఉండటం, ఒకరి గురించి ఒకరు మాట్లాడుతూ ఉండడం వల్ల వీళ్ళ మధ్య ప్రేమ చిగురించిందని తొందరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ గతంలో కొన్ని వార్తలు కూడా వెలువడ్డాయి. ఇక ఈ సంవత్సరం అక్టోబర్ లో వీళ్ళ ఎంగేజ్మెంట్ అయిందంటూ వార్తలైతే వచ్చాయి. ఇక ఇప్పుడు ఫిబ్రవరి 26వ తేదీన వీళ్లు పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాల మీద సరైన క్లారిటీ లేదు.
ఎందుకంటే అటు విజయ్ దేవరకొండ గానీ, ఇటు రష్మిక మందాన గాని ఎవరూ కూడా దీనిమీద స్పందించడం లేదు. ఎవరో ఒకరు రెస్పాండ్ అయితే గాని ఈ వార్తలకు చెక్ పెట్టాల్సిన అవసరమైతే రానుంది. నిజంగానే వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారా? రహస్యంగా పెళ్లి చేసుకొని తమ అభిమానులకు, ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారా? అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక వీళ్ళ కాంబినేషన్లో మరో సినిమా వస్తే చూడాలని ప్రేక్షకులంతా ఆసక్తి ఎదురు చూస్తున్నారు.
రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుందనే వార్తలు కూడా వస్తున్నాయి. వీళ్ళ జంటకి స్క్రీన్ మీద చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. వీళ్ళ మధ్య వచ్చే కెమిస్ట్రీ కూడా చాలా బాగుంటుంది అంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేయడం విశేషం…