Asim Munir Dhurandhar: సినిమాల ప్రభావం ప్రేక్షకుల మీద విపరీతంగా ఉంటుంది. సమాజానికి మంచి చేసే సినిమాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు వాటిని చూసి పాటిస్తే బాగుంటుందంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. ఇక రీసెంట్ గా వచ్చిన ‘దురంధర్’ సినిమా పాకిస్తాన్ ఎలా టెర్రరిస్టులను తయారు చేసి పెంచి పోషిస్తుందనే విషయాలను ఇందులో క్లియర్ కట్ గా చూపించారు. కాబట్టి దర్శకుడు ఆదిత్య ధర్ ను చూసి పాకిస్తాన్ వాళ్లంతా భయపడిపోతున్నారు… ముఖ్యంగా పాక్ సైనిక నియంత ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ భయం లో ఉన్నాడు… భారతదేశం చేసిన ఆపరేషన్ సింధూర్ నుంచి పూర్తిగా కోలుకోలేకపోయిన పాకిస్తాన్ ఇప్పుడు చైనా నుంచి ఐదవ తరం యుద్ధ విమానాలు, టర్కీ నుంచి రక్షణ క్షిపణులను తీసుకొచ్చుకుంటుంది. యుద్ధం నుంచి రక్షణ పొందడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నప్పటికి దురంధర్ సినిమాతో దర్శకుడైన ఆదిత్యధర్ కొట్టిన దెబ్బ నుంచి వాళ్ళు ఇంకా కోలుకోలేకపోతున్నారు. 2000 వ సంవత్సరంలో పాకిస్తాన్ ఎంతమందిని టెర్రరిస్టులుగా మార్చింది.
వాళ్ళని ఎలా పెంచి పోషించింది అనే పాయింట్ మీదనే ఈ సినిమాను తెరకెక్కించారు…రెహమాన్ దకైత్, ఉజైర్ బలోచ్ లాంటి వాళ్ళతో పాకిస్తాన్ కి ఉన్న సంబంధాలను ఈ సినిమాలో క్లియర్ కట్ గా చూపించారు… బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ అంటే పాకిస్తాన్ కి మొదటి నుంచి భయమే తమకు వ్యతిరేకంగా సినిమాలను చేయకూడదంటూ గతంలో ఐశ్వర్యరాయ్ లాంటి వారికి సైతం వాళ్ళు తమ సమాచారం అయితే తెలియజేశారు.
అయినప్పటికీ బాలీవుడ్ వాళ్ళు ఎక్కడ ఆగకుండా పాకిస్తాన్ చేసే కుట్రలను ఎప్పటికప్పుడు సినిమాల రూపంలో చూపిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే కాకుండా వారిని ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు… ఇక మొత్తానికైతే దురంధర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది.
పాకిస్తాన్లో సైతం దురంధర్ సినిమా పాటలకు అక్కడి జనాలు డాన్సులు వేస్తున్నారు అంటే ఆ సినిమా ఎంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ లోని చీకటి కోణాలను సైతం బయటికి తీసిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ గర్వపడేలా తెరకెక్కించినందుకు దర్శకుడు ఆదిత్య ధర్ ను ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు…