Vijay Deverakonda Rashmika Mandanna Wedding Arrangements: మరో రెండు రోజుల్లో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) , రష్మిక(Rashmika Mandanna) జంట వివాహం చేసుకోబోతున్నారు. ఆరేళ్ళ సుదీర్ఘ ప్రేమ ప్రస్థానం ని కొనసాగించిన ఈ జంట , ఇప్పుడు శాశ్వతంగా తమ బంధాన్ని బలపర్చుకుంటూ ఒకటి కాబోతున్నారు. ఇన్నేళ్లు రహస్యంగా వీళ్ళ రిలేషన్ ని దాచుకుంటూ వచ్చారు , కానీ రీసెంట్ గానే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వీళ్ళ పెళ్లి కి సంబంధించి అధికారిక ప్రకటన చేశారు. రాజస్థాన్ లోని ఉదయపూర్ లో వీళ్లిద్దరి వివాహం జరగబోతుంది. ఈ పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లు కనీవినీ ఎరుగని రేంజ్ లో చేస్తున్నారు. నాగబాబు కూతురు నిహారిక కొణిదెల పెళ్లి ఎలా జరిగిందో అందరికీ తెలుసు కదా , ఆ తరహాలోనే మూడు రోజుల పాటు ఈ వివాహ మహోత్సవం జరగబోతుంది అట. అతిథుల కోసం వీళ్ళు చేసిన ఏర్పాట్లు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ సమీపంలో అరవల్ల కొండల మధ్య ఉన్న ‘ది మెమెంటోస్ బై ఐటీసీ హోటల్స్’ లో ఈ వివాహ మహోత్సవం జరగనుంది . చాలా గోప్యతతో నిండిన ఈ లగ్జరీ రీస్టార్ట్ లో దాదాపుగా 117 ప్రైవేట్ విల్లాలు ఉంటాయట. ఈ పెళ్ళికి వచ్చే అతిథుల కోసం ఈ విల్లాలనే వసతి ఏర్పాట్లు గా మార్చినట్టు తెలుస్తోంది. ఈ ప్రాంగణం లో ఆహ్లాదకరమైన సరస్సు , నదితో తో పాటు ప్రైవేట్ హెలిప్యాడ్ సౌకర్యం కూడా ఉందట. మొత్తం కొండపై విస్తరించిన ఈ ప్రాపర్టీ లో వివాహ వేడుకలు ఎంతో రాజసంగా జరుగుతాయాట. ఇది ఉదయపూర్ నగరానికి 25 కిలోమీటర్ల దూరం లో ఉంటుంది . చుట్టూ పక్కన మొత్తం అందమైన లొకేషన్స్ ని చూస్తే స్వర్గం లోకి అడుగుపెట్టామా అనే ఫీలింగ్ కలుగుతుందట.
ఇది పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ ప్రాపర్టీ ని విజయ్ దేవరకొండ ఆరు నెలల క్రితమే బుక్ చేశాడట . నేడు ఉదయం ఆయన 50 మంది అతిథులతో కలిసి ఉదయపూర్ విమానాశ్రయం లో దిగాడు. మూడు రోజుల పాటు జరిగే ఈ వివాహ వేడుకలో సినీ ఇండస్ట్రీ కి చెందిన వాళ్ళు చాలా తక్కువగానే వస్తారట . ఎక్కువ శాతం కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వివాహ వేడుకలో ఉంటారని తెలుస్తోంది. మార్చి 4న హైదరాబాద్ లోని తాజ్ బంజారా హోటల్ లో రిసెప్షన్ జరగనుంది . ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారు.