Vijay Deverakonda: కెరీర్ మొత్తం మీద అర్జున్ రెడ్డి, గీత గోవిందం తప్ప మరో సరైన సక్సెస్ లేని విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కి, యూత్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. కానీ ఆ క్రేజ్ తగ్గ సినిమాలు మాత్రం ఆయన నుండి రావడం లేదు. వరుసగా డియర్ కామ్రేడ్, లైగర్, ది ఫ్యామిలీ స్టార్, ఖుషి వంటి ఫ్లాప్స్ ని అందుకున్న విజయ్ దేవరకొండ, చాలా కసితో కష్టపడి చేసిన చిత్రం కింగ్డమ్. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మొదట్లో పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ పూర్తి స్థాయిలో షోస్ పడిన తర్వాత ఆడియన్స్ సెకండ్ హాఫ్ బాగాలేదని చెప్పుకొచ్చారు. దీంతో మొదటి నుండి హైప్ ఉండడం వల్ల ఓపెనింగ్ వీకెండ్ బాగానే వసూళ్లు వచ్చాయి కానీ, ఆ తర్వాత మాత్రం దారుణంగా పడిపోయాయి.
ఓవరాల్ గా బయ్యర్స్ కి నష్టాలనే మిగిలించింది. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత, అబ్బో అదిరిపోయింది , విజయ్ దేవరకొండ చాలా గట్టి బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు అని అనుకున్నారు. కానీ తీరా చూస్తే సెకండ్ హాఫ్ బాగా పడిపోవడం తో నిరాశకు గురయ్యారు. దీంతో సోషల్ మీడియా లో నెగిటివ్ టాక్ బాగా వ్యాప్తి చెందింది, ఫలితంగా సినిమాకు రెండవ రోజు వసూళ్లు భారీ గా పడిపోయాయి. ఫుల్ రన్ లో 20 కోట్ల నష్టాన్ని మిగిలించింది. ఈ చిత్ర నిర్మాత రీసెంట్ గానే కింగ్డమ్ ఫలితం గురించి మాట్లాడుతూ , సెకండ్ హాఫ్ ఇలా తీస్తే వర్కౌట్ అవధాని నేను, మా బాబాయ్ గౌతమ్ కి ఆరు నెలల నుండి చెప్తూనే ఉన్నాం, కానీ స్టీరియో టైపు ని బ్రేక్ చేద్దాం అంటూ ఈ సినిమాని ఆయనకు నచ్చినట్టు తీసాడని, ఫలితం మేము ఊహించినట్టుగానే వచ్చిందంటూ చెప్పుకొచ్చాడు.
ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని విడుదల కొత్తల్లో చాలా బలంగా చెప్పుకొచ్చిన నాగవంశీ, ఇప్పుడు సీక్వెల్ లేదని చెప్పేసాడు. అప్పుడు యాంకర్ మొత్తం ఒక సినిమాగా తీసి ఉంటే బాగుండేది అని మా అభిప్రాయం అనగా, ఇక దీని గురించి మాట్లాడుకొని, గౌతమ్ ని బాధ పెట్టడం అనవసరం, అది అలా జరిగిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు. అలా ప్రెస్టీజియస్ మూవీ సీక్వెల్ ఆగిపోయింది అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ప్రస్తుతం విజయ్ రాహుల్ సాంకృత్యాన్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం తో పాటు ‘రౌడీ జనార్థన’ అనే చిత్రం చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది. వీటిల్లో ఎదో ఒక్క సినిమా హిట్ అయినా విజయ్ రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి వెళ్ళిపోతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.