
Vijay Deverakonda: విజయ్ దేవరకొండలో మంచి బిజినెస్ మెన్ ఉన్నాడు. తనకు సక్సెస్ రాగానే, ఆ సక్సెస్ తాలూకు స్టార్ డమ్ ను మిగిలిన రంగాల వైపు మల్లించాడు. బట్టల వ్యాపారం చేస్తూనే.. అటు బైక్ ల కంపెనీలో కూడా పెట్టుబడులు పెట్టాడు. మధ్యలో సోషల్ మీడియాలో కూడా ప్రమోషన్స్ చేస్తూ బాగా సంపాదిస్తున్నాడు. ఇక తనతో పాటు ఆదాయ వనరులను పెంచుకోవడానికి ఎక్కడో అమెరికాలో జాబ్ చేసుకుంటున్న తన తమ్ముడిని పట్టుకొచ్చి హీరోని చేశాడు.

అయితే, ఆనంద్ దేవరకొండలో హీరో లేడు. అతగాడికి యాక్టింగ్ కూడా సరిగ్గా రాదు. అయినా, తన తమ్ముడిని స్టార్ ను చేయడం కోసం విజయ్ దేవరకొండ బాగా కష్టపడుతున్నాడు. రకరకాల ప్రమోషన్స్ చేస్తూ.. ఎలాగైనా తనలాగే తన తమ్ముడిని కూడా ఇండస్ట్రీలో నిలబెట్టాలని విజయ్ ఆశ. ఐతే, దొరసాని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ మాత్రం మొదటి సినిమాతోనే తేలిపోయాడు.
ఆ తర్వాత మరో సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్ చేసినా.. అనుకున్నంత రేంజ్ లో హీరోగా గుర్తింపు తెచ్చుకోలేదు. అదేంటో గానీ, ఆనంద్ సినిమాల్లో హీరోయిన్లకు పేరు వస్తోంది గానీ. ఆనంద్ దేవరకొండకు మాత్రం పేరు రావడం లేదు. ఇపుడు తాజాగా ఆనంద్ నటించిన పుష్పక విమానం ఈనెల 12న విడుదల అవుతుంది.
ఈ సినిమాలో ఆనంద్ డీసెంట్ స్కూల్ టీచర్ పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమా ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా ఆద్యంతం వినోదాత్మకంగా ఉండబోతుందని టీమ్ బాగా ప్రమోట్ చేస్తోంది. ఎలాగూ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి. ఆనంద్ ఈ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకుంటాడని విజయ్ దేవరకొండ బాగా డప్పు కొడుతున్నాడు.
కానీ, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేదే డౌట్. ఇదంతా పక్కనపెడితే… విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఈ సినిమా కోసం చాలా యాక్టివ్ గా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఒక ప్రొడ్యూసర్ గా ప్రమోషన్స్ చేస్తే బాగుండేది. కానీ, తన తమ్ముడిని స్టార్ ను చేయండని ప్రేక్షకులను కోరుతున్నట్లు విజయ్ లో బలమైన ఆరాటం కనిపిస్తుంది. మరి విజయ్ దేవరకొండ ఆరాటానికి ఫలితం వస్తోందా ?