Vijay Deverakonda: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనగానే స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసే సినిమాలకు ఇండస్ట్రీలో ఎక్కువ ఆదరణ దక్కుతుంది. వాళ్ళు చేసే ప్రతి సినిమా ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. తద్వారా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో సక్సెస్ ను సాధించిన విజయ్ ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇప్పటివరకు విజయ్ దేవరకొండ చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి. ఇక రీసెంట్ గా రష్మిక మందాన ను పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి ఇక పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ విషయాలలో కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
Also Read: ‘ధురంధర్ 2’ తో పోటీ పడడం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీం చేసిన పెద్ద మిస్టేక్.. ఓవర్సీస్ లో చావు దెబ్బ!
విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల సినిమాలైతే చేయలేకపోయాడు. కానీ ప్రస్తుతం ఉన్న ఒక్క యంగ్ హీరో విజయ్ దేవరకొండ లా కాకుండా వరుసగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆ హీరో ఎవరంటే నవీన్ పోలిశెట్టి కావడం విశేషం…
ఈ సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో వచ్చి 100 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టాడు. తర్వాత సినిమాతో కూడా భారీ కలెక్షన్స్ ను రాబడతానంటూ ఆయన తన అభిమానులకైతే మాట ఇస్తున్నాడు. వరుసగా రెండు సినిమాలతో 100 కోట్లు రాబడితే ఆయన విజయ్ దేవరకొండ చేయలేని ఒక ఫీట్ అయితే సాధించినవాడవుతాడు.
కెరియర్ మొదటి నుంచి కూడా విజయ్ దేవరకొండ నవీన్ పోలిశెట్టి ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనందరికి తెలిసిందే. వీళ్లిద్దరూ కలిసి ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో కూడా నటించారు. ఇక ఇప్పుడు వీళ్లిద్దరు హీరోలుగా మారి సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగడం అనేది వాళ్ళ అభిమానులను ఆనందపడేలా చేస్తుంది… ఇక రాబోయే సినిమాలతో వీళ్ళు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు. తద్వారా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారు అనేది చూడాలి…