Vijay Devarakonda Kushi: లైగర్ వంటి భారీ డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’..నిన్ను కోరి మరియు మజిలీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తీసిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు..చాలా కాలం నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గత కొంతకాలం నుండి ఆగిపోయింది..కారణం ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సమంత అనారోగ్యం పాలవ్వడమే..ప్రస్తుతం ఆమె ‘మియోసిటిస్’ అనే వ్యాధికి చికిత్స నిమిత్తం సౌత్ కొరియా కి వెళ్ళింది.

ఆమె కోలుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నందున షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది..సంపూర్ణంగా సమంత ఆరోగ్యవంతురాలు అయ్యేంత వరుకు షూటింగ్స్ లో పాల్గొనరాదని డాక్టర్లు చాలా స్ట్రిక్ట్ గా చెప్పారట..దీనితో సమంత కోసం ఎదురు చూస్తే మరో ఆరునెలలు వేచి చూడాలని..ఇప్పటికే 50 శాతం కి పైగా షూటింగ్ జరగగా ఆమె స్థానం లో మరొకరిని తీసుకొని షూటింగ్ చేసే పరిస్థితులు కూడా లేవు.
అందువల్ల సమంత మరో మూడు నెలలు లోపు రాకపోతే సినిమాని క్యాన్సిల్ చెయ్యడం ఉత్తమం అని నిర్మాత ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్..మరి సమంత తొందరగా కోలుకొని మిగిలిన షూటింగ్ ని పూర్తి చేస్తుందా..లేదా మరింత సమయం తీసుకుంటుందా అనేది చూడాలి..విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన డేట్స్ మొత్తం ఈ సినిమాకే కేటాయించాడు..అనుకున్న విధంగా షూటింగ్ పూర్తి అయ్యి ఉంటె,ఈ సినిమాని ఈ నెల 25 వ తారీఖున విడుదల చెయ్యడానికి సన్నాహాలు కూడా చేసుకున్నారు..కానీ అనుకోకుండా సమంత కి ఇలా జరగడం మూవీ యూనిట్ ప్లాన్స్ అన్నిటిని డిస్టర్బ్ చేసింది.

ఇక విజయ్ దేవరకొండ కూడా తదుపరి చిత్రాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు..జెర్సీ మూవీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తో త్వరలోనే ఒక సినిమాని ప్రారంభించబోతున్నాడట విజయ్ దేవరకొండ..జనవరి నెల నుండి ఈ సినిమాకి కొబ్బరి కాయ కొట్టబోతున్నారు..రెగ్యులర్ షూటింగ్ కూడా అదే నెలలో ప్రారంభం అవుతుందని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్.