Vijay Devarakonda- Samantha: హీరో విజయ్ దేవరకొండ-సమంత ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. అమెరికాలో ఉన్న సమంతకు అర్ధరాత్రి కాల్ చేసి మిస్ యూ అని చెప్పాడు. వీరిద్దరూ జంటగా ఖుషి మూవీ తెరకెక్కింది. ఖుషి సాంగ్స్ ప్రోమోలు అదరగొడుతున్నాయి. ముఖ్యంగా వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ప్రేమికుల పాత్రల్లో మైమరిచి నటించారనిపిస్తుంది. అయితే ఆఫ్ స్క్రీన్ లో కూడా రెచ్చిపోతున్నారు వీరిద్దరూ. హైదరాబాద్ వేదికగా మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు.
ఖుషి ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ఈ ఈవెంట్ ట్రెమండస్ సక్సెస్. ఈ ఈవెంట్లో వేదికపై ఓపెన్ రొమాన్స్ చేశారు విజయ్ దేవరకొండ-సమంత. విజయ్ అయితే ఏకంగా చొక్కా విప్పేసి మజిల్స్ చూపించాడు. సమంత కూడా అరాకొరా చోళీ ధరించింది. ఇక సమంతను విజయ్ దేవరకొండ పైకెత్తి గాల్లో తిప్పడం హైలెట్ అని చెప్పాలి. పబ్లిక్ ఈవెంట్లో సమంత, విజయ్ దేవరకొండ చేసిన పనికి జనాలు నోరెళ్లబెట్టారు.
తాజాగా విజయ్ దేవరకొండ మరో రొమాంటిక్ పని చేశాడు. అర్ధరాత్రి సమంతకు వీడియో కాల్ చేశాడు. సమంత అమెరికాలో ఉన్న నేపథ్యంలో మనకు రాత్రి ఆమెకు పగలు. సమంతకు భారత కాలమానం ప్రకారం విజయ్ దేవరకొండ అర్ధరాత్రి ఫోన్ చేశాడు. నిన్ను బాగా మిస్ అవుతున్నట్లు చెప్పాడు. నీకు ఒక జోక్ చెప్పేందుకు కాల్ చేశానని అన్నాడు. అందుకు సమంత మురిసిపోయింది.
ఖుషి మూవీలోని నా రోజా నువ్వే సాంగ్ పాడి సమంతను నవ్వించాడు. ఈ వీడియో కాల్ ఫుటేజ్ విజయ్ దేవరకొండ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఖుషి చిత్ర ప్రమోషన్స్ భాగంగా సమంతకు విజయ్ దేవరకొండ వీడియో కాల్ చేశాడు. ఈ విషయాన్ని మీడియా ప్రముఖంగా కవర్ చేసింది. ఖుషి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 3న ఖుషి పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది.
View this post on Instagram