https://oktelugu.com/

Pavan Kalyan Movie Title: పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్ తో విజయ్ దేవరకొండ సినిమా

Pavan Kalyan Movie Title: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఖుషి సినిమా అప్పట్లో ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్ అనే సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా తో పవన్ కళ్యాణ్ రేంజ్ నెంబర్ 1 హీరో స్థాయి కి ఎదిగి సొంత అన్నయ్య చిరంజీవి తోనే పడే రేంజ్ లో నిలబెట్టింది..ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న కోట్లాది మంది యువత కి ఐకాన్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 19, 2022 / 01:01 PM IST
    Follow us on

    Pavan Kalyan Movie Title: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఖుషి సినిమా అప్పట్లో ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్ అనే సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా తో పవన్ కళ్యాణ్ రేంజ్ నెంబర్ 1 హీరో స్థాయి కి ఎదిగి సొంత అన్నయ్య చిరంజీవి తోనే పడే రేంజ్ లో నిలబెట్టింది..ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న కోట్లాది మంది యువత కి ఐకాన్ గా మారాడు..ఖుషి తర్వాత గబ్బర్ సింగ్ వరుకు సరైన హిట్ ఒక్కటి కూడా లేకపోయినా కూడా ఆయన క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు అంటే ఖుషి సినిమా ఆయనకీ ఇచ్చిన మైలేజి అలాంటిది..పవన్ కళ్యాణ్ కి అలాంటి కల్ట్ ఫ్యాన్ బేస్ ని ఇచ్చిన ఈ సినిమా టైటిల్ ని ఇప్పుడు ప్రముఖ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన కొత్త సినిమాకి వాడుకోబోతున్నాడు అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది..దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం చూడబోతున్నాము.

    Pavan Kalyan Movie Title

    ఇక అసలు విషయానికి వస్తే విజయ్ దేవరకొండ మరియు సమంత కలిసి త్వరలోనే ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు..నిన్ను కోరి , టాక్ జగదీశ్ మరియు మజిలీ వంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన శివ నిర్వాణ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు..విజయ్ దేవరకొండ మరియు సమంత కాంబినేషన్ లో రాబోతున్న ఫుల్ లెంగ్త్ మూవీ ఇదే..గతం లో ఈ జోడి మహానటి సినిమాలో నటించింది..కానీ అందులో వీళ్లిద్దరి పాత్ర నిడివి తక్కువ అనే విషయం మన అందరికి తెలిసిందే..ఇది ఇలా ఉండగా కోట్లాది మంది అభిమానులు అంతలా అభిమానించే పవన్ కళ్యాణ్ కెరీర్ లో అంత పెద్ద హిట్ గా నిలిచి ఆయన కెరీర్ నే మలుపు తిప్పిన ఖుషి సినిమా టైటిల్ ని వాడుకుంటే ఆయన ఫాన్స్ ఊరుకుంటారా లేదా అనేది ఇప్పుడు పెద్ద సమస్య గా మారింది..మరి విజయ్ దేవరకొండ పవన్ కళ్యాణ్ అభిమానులను ఎలా ఫేస్ చేస్తాడు..వాళ్ళని ఎలా ఒప్పిస్తాడు అనేది ఇప్పుడు పెద్ద సవాలు గా మారింది..గతం లో యంగ్ హీరో నాని కూడా ఇలాగే చిరంజీవి కెరీర్ లో సెన్సషనల్ హిట్ గా నిలిచిన గ్యాంగ్ లీడర్ సినిమా టైటిల్ ని వాడుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..అప్పట్లో చిరంజీవి గారి ఫాన్స్ అభ్యంతరం వ్యక్తం చేసేలోపు దానిని నాని’s గ్యాంగ్ లీడర్ గా టైటిల్ మార్చారు..ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా అదే ఫాలో అవ్వబోతున్నాడా లేదా అనేది చూడాలి.

    Also Read: Nagarjuna Hello Brother Movie: ఆ స్టార్ హీరో నాగార్జునకి డూప్.. కారణం ఆయనే !

    విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూర్తి జగన్నాథ్ తో లైగర్ అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకి చేరుకుంది..ఈ ఏడాది ఆగష్టు 22 వ తారీఖున ఈ సినిమా మన ప్రేక్షకుల ముందుకి రాబోతుంది..పాన్ ఇండియా లెవెల్ లో పూరి జగన్నాథ్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ప్రముఖ హీరోయిన్ ఛార్మి తో కలిసి తన సొంత నిర్మాణ సంస్థ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు..ఈ సినిమా తర్వాత మళ్ళీ విజయ్ దేవరకొండ తోనే ఆయన ‘JGM ‘ అనే సినిమాని తియ్యబోతున్నాడు..గతం లో సూపర్ స్టార్ మహేష్ బాబు తో తియ్యాలనుకున్న జన గణ మన స్క్రిప్ట్ ని ఇప్పుడు విజయ్ దేవరకొండ తో తీస్తున్నాడు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్..ఈ రెండు సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ మరియు సమంత కాంబినేషన్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది..ఈ సినిమాలతో పాటు ఆయన త్వరలోనే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు..ఇలా వరుస సినిమాలతో ఫాన్స్ కి పిచ్చెక్కించబోతున్నాడు విజయ్ దేవరకొండ.

    Also Read: Pragathi: లేటు వ‌య‌సులో ఘాటు అందాలు.. ప్ర‌గ‌తి బ‌ర్త్‌డే ఫోజులు చూస్తే మ‌తి పోవాల్సిందే..

    Recommended Videos:

    Tags