Vijay Devarakonda: విజయ్ దేవరకొండ, పూరీజగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా లైగర్. విడుదలకు ముందు ఎన్నో అంచనాలు క్రియేట్ చేసింది. అందరు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. విజయ్ దేవరకొండ కూడా ప్యాన్ ఇండియా స్టార్ కావాలని ఆశ పడ్డారు. కానీ ఆయన ఆశలు అడియాశలే అయ్యాయి. దీంతో సినిమాపై ఉన్న భారీ అంచనాలు తలకిందులయ్యాయి. నిర్మాతలకు చేదు అనుభవమే మిగిలింది. ఈ నేపథ్యంలో లైగర్ సినిమా చూపిన అపజయంతో అందరు కుంగిపోయారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా బోల్తా కొట్టడంతో కంగుతిన్నారు.

లైగర్ సినిమాను పూరీ జగన్నాథ్, హీరోయిన్ చార్మి, కరణ్ జోహార్ ముగ్గురు కలిసి నిర్మించారు. దీంతో వారి డబ్బులు అన్ని వృథా అయ్యాయి. రూ.90 కోట్లు రాబడుతుందని అంచనా వేసుకుంటే రూ.20 కోట్లు మాత్రమే కలెక్షన్ చేసింది. ఇంకా రూ. 70 కోట్లు రాకుండా పోయాయి. నిర్మాతలకు రూ. 50 కోట్ల మేర నష్టం వచ్చినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాతలకు మాత్రం చేదు అనుభవం మిగిల్చింది. ఇక ఏం చేయాలో కూడా వారికి అర్థం కావడం లేదు.
Also Read: Krithi Shetty: ప్రత్యేక పూజలు చేస్తున్న కృతి శెట్టి…. ఆ దోషం పోవడానికేనా? గతంలో రష్మిక కూడా!
హీరో విజయ్ దేవరకొండ నిర్మాతల ఇబ్బందులను అర్థం చేసుకున్నాడు. విజయ్ కు రూ. 15 కోట్లు పారితోషికం కింద ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సినిమా ఆశించిన మేర ఆడకపోవడంతో నిర్మాతలకు వచ్చిన నష్టాన్ని అర్థం చేసుకున్న విజయ్ రూ. 6 కోట్లు తిరిగి వారికి ఇచ్చినట్లు చెబుతున్నారు. విజయ్ దేవరకొండ తీసుకున్న నిర్ణయంపై అందరిలో ప్రశంసలు వస్తున్నాయి. ఆయన పెద్దమనసుకు అందరు ఫిదా అవుతున్నారు. రెమ్యునరేషన్ తిరిగి ఇవ్వడమంటే దానికి ఎంతో త్యాగం కావాలి.

విజయ్ దేవరకొండ కెరీర్ లోనే పెద్ద అపజయంగా లైగర్ నిలుస్తోంది. మొదటి ఆటకే సినిమా ఫట్ అని తేలిపోయింది. దీంతో సినిమా అపఖ్యాతి మూటగట్టుకుంది. సినిమా విడుదలకు ముందు చేసిన హంగామా అంతా పనికి రాకుండా పోయింది. లైగర్ సినిమాతో పెద్ద విజయం అందుకోవాలని భావించినా వీలు కాలేదు. పూరీ జగన్నాథ్ మార్కు ఎక్కడా కనిపించలేదని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. సినిమా ఆద్యంతం ఆకట్టుకోలేకపోయింది. వాస్తవాలకు దూరంగా ఉండటంతోనే సినిమా హిట్ కాలేకపోయింది.
గత సినిమాలతో పోలిస్తే లైగర్ సినిమా కనీసం వాటి సరసన కూడా చేరలేకపోయింది. విజయ్ దేవరకొండ సినిమాకు పెద్ద అండ అని అందరు అనుకున్నా అది నెరవేరలేదు. ఈ క్రమంలో లైగర్ సినిమా చేదు అనుభవంతో పూరీ డైలమాలో పడ్డారు. తరువాత సినిమా కూడా విజయ్ తోనే జనగణమన తీయాల్సి ఉండటంతో దాని మీద అయినా శ్రద్ధ వహించి హిట్ చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం చేసిన తప్పులు చేయకుండా సినిమాను విజయవంతంగా నడిచే సినిమాగా రూపొందించేందుకు సిద్ధపడుతున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Also Read:Pawan Kalyan Birthday Special: ‘పవర్’ మార్చే పవన్ స్టార్.. జన సేనాని రాజకీయ లక్ష్యం అదే!
[…] Also Read: Vijay Devarakonda: రోడ్డునపడ్డ పూరి-చార్మిలను ఆద… […]