Vijay Devarakonda-Samantha: విజయ్ దేవరకొండ-సమంత టర్కీ దేశంలో ఉన్నారు. అక్కడి అందమైన ప్రదేశాల్లో విహరిస్తున్నారు. విజయ్ దేవరకొండతో దిగిన ఓ రొమాంటిక్ ఫోటో సమంత ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. అది కాస్తా వైరల్ అవుతుంది. మీరిద్దరూ సో క్యూట్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇదేమీ పర్సనల్ ట్రిప్ కాదు. ఖుషి చిత్ర షూటింగ్ లో భాగంగా అక్కడకు వెళ్లారు. దర్శకుడు శివ నిర్వాణ లేటెస్ట్ షెడ్యూల్ విదేశాల్లో ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో టర్కీ దేశానికి సమంత, విజయ్ దేవరకొండ వెళ్లారు.
ఖుషి మూవీ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. సమంత-విజయ్ దేవరకొండ గతంలో మహానటి మూవీలో జంటగా నటించారు. ఖుషిలో పూర్తి స్థాయి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఈ చిత్ర సెట్స్ లో విజయ్ దేవరకొండ-సమంత చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఇద్దరూ చాలా ఓపెన్ మైండ్స్ కలిగిన వ్యక్తులు కావడంతో రాసుకుపూసుకు తిరుగుతున్నారు.
ఇక ఖుషి విజయం సాధించాలని విజయ్ దేవరకొండ గట్టిగా కోరుకుంటున్నారు . చెప్పాలంటే గీత గోవిందం మూవీ తర్వాత ఆయనకు సాలిడ్ హిట్ లేదు. లాస్ట్ రిలీజ్ లైగర్ ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేసింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ దారుణ పరాజయం చవి చూసింది. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లైగర్ ఫెయిల్యూర్ విజయ్ దేవరకొండను భారీగా దెబ్బతీసింది. షూటింగ్ జరుపుకుంటున్న జనగణమన ఆగిపోయింది.
అయినా విజయ్ దేవరకొండకు ఆఫర్స్ తగ్గలేదు. ఆయన వరుస ప్రాజెక్ట్స్ ప్రకటిస్తున్నారు. ఇక సమంత సిటాడెల్ సిరీస్ షూటింగ్ పూర్తి చేస్తున్నారు. సిటాడెల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సిరీస్ గా తెరకెక్కుతుంది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్ర చేస్తున్నారు. అలాగే ఆమె చెన్నై స్టోరీ అనే హాలీవుడ్ మూవీకి సైన్ చేశారనే ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారిక సమాచారం లేదు. ఫిలిప్ జాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు వివేక్ కల్రా హీరోనట.