Vijay Devarakonda Rashmika Mandanna : చాలా కాలం నుండి సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్న జంట విజయ్ దేవర కొండ(Vijay Devarakonda), రష్మిక(Rashmika Mandanna). వీళ్లిద్దరు ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారు అనే విషయం ఓపెన్ సీక్రెట్. రష్మిక హైదరాబాద్ లో విజయ్ దేవరకొండ మరియు అతని కుటుంబం తో కలిసి ఉంటుంది అనేది కూడా ఓపెన్ సీక్రెట్. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో తెలియదు కానీ,కచ్చితంగా పెళ్లి చేసుకుంటారు అనే క్లారిటీ మాత్రం ప్రతీ ఒక్కరిలో ఉంది. కానీ వీళ్ళు మేము రిలేషన్ లో ఉన్నాము, త్వరలో పెళ్లి చేసుకుంటాము అని మాత్రం ఓపెన్ గా చెప్పలేకపోతున్నారు. రష్మిక లేటెస్ట్ చిత్రం ‘కుబేర’ ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో రష్మిక విజయ్ దేవరకొండ గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
యాంకర్ సుమ కింద కూర్చున్న రష్మిక వద్దకు వచ్చి ‘మేము కొంతమంది హీరోల పేర్లు చెప్తాము. వాళ్ళ నుండి నువ్వు ఏ క్వాలిటీ కాపీ కొట్టాలని అనుకుంటున్నావు’ అని అడుగుతూ ముందుగా నాగార్జున గురించి చెప్పమంటుంది. అప్పుడు రష్మిక ‘నాగార్జున సార్ నుండి నేను చార్మ్, ఆరా ని కాపీ కొట్టాలని అనుకుంటున్నాను’ అని అంటుంది. ఇక ఆ తర్వాత ధనుష్ గురించి అడగ్గా ‘ ధనుష్ గారు ఎలాంటి వర్క్ ని అయినా చేయగలడు..ఆయన నుండి ఇది నేర్చుకోవాలి’ అని అంటుంది రష్మిక. అల్లు అర్జున్ గురించి అడగ్గా ‘అతని నుండి స్వాగ్ ని కాపీ కొట్టాలని అనుకుంటున్నాను’ అని అంటుంది. ఇక చివర్లో విజయ్ దేవరకొండ గురించి అడగ్గా ‘అతని నుండి అన్ని లాగేసుకుంటా..అన్ని నాకే’ అని సమాధానం చెప్తుంది.
ఇంతకు మించి ఆమె విజయ్ దేవరకొండ తో రిలేషన్ లో ఉంది అని చెప్పడానికి రుజువు ఏమి కావాలి చెప్పండి?. ఇలా పరోక్షంగా సమాదానాలు చెప్తూనే ఉంటుంది కానీ, అవును మేమిద్దరం నిజంగానే ప్రేమలో ఉన్నాము అని చెప్పడానికి సమస్య ఏంటో అని ఆమె అభిమానులు సైతం అనుకుంటూ ఉంటారు. ఇకపోతే పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా వేల కోట్ల వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించాయి ఈమధ్య కాలంలో రష్మిక సినిమాలు. అలాంటి రష్మిక కి రీసెంట్ గా విడుదలైన ‘సికిందర్’ చిత్రం స్పీడ్ బ్రేకర్ వేసింది. ఈ చిత్రం తర్వాత ఆమె నుండి విడుదల అవుతున్న చిత్రం ‘కుబేర’. నిన్న విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కచ్చితంగా ఈ సినిమాతో ఆమె భారీ కం బ్యాక్ ఇస్తుంది అని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఎంత వరకు నిజమో మరో 5 రోజుల్లో తెలియనుంది.