Modi Photo On LPG Cylinder: తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ బీజేపీని లక్ష్యంగా చేసుకుని రెచ్చిపోతోంది. కేంద్రం ఇస్తున్న పథకాలకు రాష్ట్రం పేరుతో ప్రచారం చేసుకుంటోంది. దీంతో బీజేపీని అప్రదిష్ట పాలు చేయాలని భావిస్తోంది. పలు పథకాలు కేంద్రం అందజేస్తున్నా ఎక్కడ కూడా సెంట్రల్ ఊసు లేకుండా చేస్తోంది. ఇప్పటికే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన పల్లె ప్రగతి పనుల్లో ఎక్కడ కూడా ప్రధాని ఫొటో లేకుండా చేస్తోంది. ఇదేంటని అడిగితే రాష్ట్ర నిధులుంటూ పితలాటకం ఆడుతోంది. దీంతో టీఆర్ఎస్ పై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కామారెడ్డి జిల్లా లో బీర్కూర్ లోని చౌకధరల దుకాణంలో ప్రధాని ఫొటో ఎందుకు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆమె మాటలకు కౌంటర్ గా సిలిండర్లపై మోదీ రూ.1105 అంటూ క్యాప్షన్ పెట్టి వ్యంగ్యంగా చూపిస్తూ పెట్టడంతో అది నెట్టింట్లో వైరల్ అవుతోంది. నిర్మల సీతారామన్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఇలా చేయడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. ప్రతి విషయానికి కేంద్రాన్ని వ్యంగ్యంగా చూపిస్తే తప్పు లేదు కానీ టీఆర్ఎస్ ను మాత్రం ఏమీ అనకూడదని చెప్పడం విడ్డూరమే.
సొమ్మొకడిది సోకొకడిది అన్నట్లు కేంద్రం ఇస్తున్న పథకాలను తమ పథకాలుగా చెప్పుకోవడం సిగ్గుచేటని ఇప్పటికే బీజేపీ నేతలు విమర్శిస్తున్నా నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ప్రతి పథకంలో కేంద్రం ప్రమేయం ఉంటున్నా రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇవ్వడం లేదని బుకాయించడం టీఱర్ఎస్ కే చెల్లుతుంది. కేసీఆర్ సారు ఇక చాలు అని ఫ్లెక్సీ పెడితే అదేదో తప్పు అన్నట్లు కోర్టు వరకు వెళ్లిన ఇప్పుడు టీఆర్ఎస్ చేసిన దానికి బీజేపీ ఏం చేయాలి అనే ప్రశ్నలు వస్తున్నాయి.
కేంద్రంతో పెట్టుకుని టీఆర్ఎస్ మరో తప్పిదం చేస్తోంది. కేసీఆర్ బీజేపీపై ఒంటికాలిపై లేస్తూ నానా విమర్శలు చేస్తుండటం తెలిసిందే. ఎన్ని చేసినా మునుగోడులో మాత్రం మళ్లీ టీఆర్ఎస్ కే భంగపాటు కలగడం ఖాయమనే వాదనలు వస్తున్నాయి. టీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యామ్నాయం బీజేపీ అని తెలుస్తోంది. అందుకే టీఆర్ఎస్ తట్టుకోలేక పాదయాత్రకు అడ్డుపడుతూ బహిరంగ సభ నిర్వహణను అడ్డుకోవాలని చూసింది. కానీ కోర్టు ఓకే చెప్పడంతో టీఆర్ఎస్ మతి పోయినట్లు అయింది.

బీజేపీకి అడుగడుగునా అడ్డు పడుతూ టీఆర్ఎస్ ఏదో సాధించినట్లు అనుకుంటున్నా రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని కాషాయ పార్టీ నేతలు చెబుతుండటంతో టీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే బీజేపీని టార్గెట్ చేసుకుని రెచ్చిపోతోంది. కానీ చివరకు మాత్రం టీఆర్ఎస్ కు ఓటమి మాత్రం తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read:CM KCR Politics: కేసీఆర్ కాకమ్మ కథలు వినే కాలం కాదిది

