Vijay Devarakonda Life Story: విజయ్ దేవరకొండ.. ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ’ చిత్రంలో ప్రత్యర్థి ఫ్రెండ్స్ గ్రూపులో ఒక చిన్న క్యారెక్టర్ లో కనిపిస్తాడు. హీరోలతో ఫైట్ చేసే బ్యాచ్ అదీ. అందులో విజయ్ ఉన్నట్టు కూడా ఎవరికీ తెలియదు. అలా చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ ‘పెళ్లి చూపులు’తో హీరో అయ్యి.. ‘అర్జున్ రెడ్డి’తో ఇండస్ట్రీని షేక్ చేసి వరుస విజయాలు.. కొన్ని అపజయాలతో ఇప్పుడు ‘లైగర్’తో ఏకంగా ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్న చందంగా విజయ్ దేవరకొండ తన నటన, ప్రతిభ, క్రమశిక్షణ, పట్టుదలతో ఈ స్థాయికి చేరుకున్నాడు. ఇంతకీ విజయ్ దేవరకొండ ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎలా ఎదిగాడన్న దానిపై స్పెషల్ స్టోరీ.

-విజయ్ దేవరకొండ బాల్యం, విద్యాభ్యాసం
విజయ్ దేవరకొండ 1989, మే 9న హైదరాబాద్ లో దేవరకొండ గోవర్ధనరావు-మాధవి దంపతులకు జన్మించారు. వీరి స్వస్థలం తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా అచ్చం పేట గ్రామం. పక్కా తెలంగాణ వాసులు. తండ్రి గోవర్ధనరావుకు సినిమాలపై ఉన్న మక్కువతో విజయ్ పుట్టకముందే హైదరాబాద్ వచ్చారు. సినిమాల్లో నటుడు కావాలనుకున్నాడు. కానీ అది సాధ్యం కాకపోవడంతో దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నారు. దూరదర్శన్ మొదలుకొని టీవీ చానళ్లలో విజయ్ తండ్రి దర్శకత్వంలో పలు సీరియళ్లు ప్రదర్శింప బడ్డాయి. విజయ్ దేవరకొండ, ఈయన తమ్ముడు ఆనంద్ ఇద్దరూ ఏపీలోని అనంతపురం జిల్లాలో ఉన్న పుట్టపర్తి శ్రీసత్యసాయి ఉన్నత పాఠశాలలో చదివారు. ఈ పాఠశాలలోనే 10వ తరగతి పూర్తి చేశారు. టీవీలు, ఫోన్లు లేని ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ పాఠశాలలోనే విజయ్ కథా రచన, నటనపై ఆసక్తి పెంచుకున్నారు.తన ప్రవర్తన, వ్యక్తిత్వం ఆ స్కూల్లోనే రూపుదిద్దుకుందని చెబుతుంటారు.
Also Read: Liger Twitter Review: ‘లైగర్’ ట్విట్టర్ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?
ఇక ఇంటర్ ను హైదరాబాద్ లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో విజయ్ చదివాడు. బదృకా కాలేజీ ఆఫ్ కామర్స్ లో డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత సినిమా రంగంపై ఇష్టంతో పలు నాటకాల్లో నటించాడు.
-విజయ్ దేవరకొండ సినిమా కెరీర్..
‘నువ్విలా’ సినిమాలో చిన్న పాత్రతో ఇండస్ట్రీలో తెరంగేట్రం చేశాడు. 2012లో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాలో కూడా ఫ్రెండ్స్ లో చిన్న క్యారెక్టర్ చేశాడు. 2015లో విడుదలైన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో రిషి పాత్రతో మెప్పించాడు. 2016లో ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోగా నటించి విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాతోనే విజయ్ కెరీర్ ఊపందుకుంది. 2017లో ద్వారక తీయగా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ విజయ్ నటనా జీవితాన్ని మలుపుతిప్పించి.. స్టార్ హీరోగా మలిచింది.బాక్సాఫీస్ రికార్డులతో పెద్ద స్టార్ గా విజయ్ మారిపోయాడు.

ఇక ఆ తర్వాత పలు ఫ్లాపులు పలకరించాయి. ‘ఏ మంత్రం వేశావో ’ సినిమా ఆడలేదు. ఆ తర్వాత ‘గీతాగోవిందం’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. 2018లో టాక్సీవాలా కూడా హిట్ అయ్యింది.
ఇప్పుడు ‘లైగర్’ సినిమాతో పూరి జగన్నాథ్ ప్యాన్ ఇండియా స్టార్ గా విజయ్ ను మలిచాడు. ఇప్పటికే యూత్ లో విజయ్ అంటే పిచ్చ క్రేజ్ ఉంది. ఒక సెన్షేషన్ గా మారిపోయాడు. ఎక్కడికి వెళ్లినా యువత, అమ్మాయిలు విజయ్ కోసం పడి చస్తున్నారు. విజయ్ తోపాటు ఎంట్రీ ఇచ్చిన హీరోలంతా కనుమరుగైన పరిస్థితుల్లో ఈ స్తాయికి మన రౌడీ హీరో చేరారంటే అతడి కృషి, పట్టుదలనే. ఎన్నో ఫ్లాపులు పలకరించినా.. కూడా కసితో సినిమాలు చేస్తూ తక్కువ సమయంలో.. తక్కువ వయసులోనే ఇంతటి స్టార్ డం సంపాదించాడంటే విజయ్ గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు.

లైగర్ మూవీతో విజయ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని.. ప్యాన్ ఇండియా హీరోగా స్థిరపడాలని ఒక సగటు తెలుగు ప్రేక్షకులుగా ఆల్ ది బెస్ట్ చెబుదాం.



[…] […]
[…] […]