Vijay Devarakonda: ఇస్మార్ట్ శంకర్ సినిమాని వదిలేసి ప్లాప్ సినిమా చేసిన విజయ్ దేవరకొండ…

అలాంటి పూరి జగన్నాధ్ టెంపర్ సినిమా తీసాక చాలా రోజులపాటు ప్లాపుల్లో ఉన్నాడు. ఇలాంటి టైం లో చాలా మంది హీరోలా దగ్గరికి వెళ్లి సినిమా చేద్దాం అని చెప్పిన కూడా ఒక్క హీరో కూడా పూరి కి అవకాశం ఇవ్వలేదు.

Written By: Gopi, Updated On : September 28, 2023 1:48 pm

Vijay Devarakonda

Follow us on

Vijay Devarakonda: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న డైరెక్టర్లలో పూరి జగన్నాధ్ ఒకరు. ఈయన ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో చాలా ఇబ్బందులు పడి తిని, తినక చాలా రకాలుగా కష్టపడి సినిమా మీద ఉన్న ఇష్టం తో సినిమా ఇండస్ట్రీ లో ఏదో ఒకటి సాధించాలనే ఉద్దేశ్యం తో వచ్చి ఇక్కడే చాలా రోజులు కష్టపడి ఆ తర్వాత ఆయనకి పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం రావడం తో బద్రి అనే సినిమా తీసి ఇండస్ట్రీ లో సూపర్ హిట్ అందుకున్నాడు.ఆ తర్వాత ఆయన చేసిన ఇడియట్, అమ్మానాన్నా ఓ తమిళమ్మాయి, పోకిరి, బిజినెస్ మ్యాన్ లాంటి సినిమాలు తీసి మంచి సక్సెస్ లు అందుకున్నాడు. ఇక ఇప్పుడు స్టార్ హీరో లు గా ఉన్న ప్రతి ఒక్క హీరో కి కూడా పూరి జగన్నాధ్ అదిరిపోయే హిట్ ఇచ్చాడు.

అలాంటి పూరి జగన్నాధ్ టెంపర్ సినిమా తీసాక చాలా రోజులపాటు ప్లాపుల్లో ఉన్నాడు. ఇలాంటి టైం లో చాలా మంది హీరోలా దగ్గరికి వెళ్లి సినిమా చేద్దాం అని చెప్పిన కూడా ఒక్క హీరో కూడా పూరి కి అవకాశం ఇవ్వలేదు. దాంతో ఆయన ఒక స్టోరీ ని విజయ్ దేవరకొండ తో చేద్దాం అని ఆయన తో చెప్పిన కూడా ఆయన కూడా పూరి కి అవకాశం ఇవ్వలేదు. దాంతో అదే స్టోరీ ని ఎనర్జిటిక్ హీరో అయిన రామ్ పోతినేని ని పెట్టి ఇస్మార్ట్ శంకర్ సినిమా తీసాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది దాంతో పూరి ఇండస్ట్రీ లో మళ్లీ సూపర్ డైరెక్టర్ గా నిలబడ్డాడు.

ఇక అదే టైం లో మళ్లీ విజయ్ వచ్చి మనం సినిమా చేద్దాం అని పూరి తో చెప్పగా సరే అని పూరి లైగర్ అనే సినిమాని విజయ్ దేవరకొండ తో తీసాడు. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా సినిమా గా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయింది ఇక దాంతో పూరి ఒక్కసారి గా భారీ గా కిందికి పడిపోయారు. ఇక వీళ్ల కాంబోలోనే వస్తుంది అనుకున్న జనగణమన సినిమా కూడా ఆగిపోయింది. మళ్లీ పూరి జగన్నాధ్ కి ఒక మంచి హిట్ కావాలి కాబట్టి ఇప్పుడు మళ్లీ రామ్ తో డబల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు.అయితే విజయ్ చేయాల్సిన ఇస్మార్ట్ శంకర్ సినిమా వదిలేసి ఇలా లైగర్ అనే ప్లాప్ సినిమా చేసాడు అంటూ అప్పట్లో విజయ్ ని చాలా మంది ట్రోల్ చేసారు.

అవును నిజానికి విజయ్ కి కూడా ఇస్మార్ట్ శంకర్ సినిమా చాలా బాగా సెట్ అయ్యేది అలాంటి ఆ సినిమా చేసి ఉంటె ఆయన కి ఇండస్ట్రీ లో గుర్తుండే పోయే ఒక హిట్ పడేది, అనవసరం గా ఒక భారీ హిట్ ఇచ్చే సినిమాని వదిలేసి భారీ ప్లాప్ సినిమా చేసాడు విజయ్ దేవరకొండ…అయితే వీళ్ల కాంబో లో మరో సినిమా రావచ్చు అని ఇండస్ట్రీ వర్గాల నుంచి చాలా రకాలైన చర్చలు నడుస్తున్నాయి…నిజానికి వీళ్ల కాంబో కి ఇప్పటికి కూడా మంచి క్రేజ్ ఉంది ఒక మంచి సబ్జెక్టు కనక వీళ్ల కాంబోలో వస్తే అది ఇండస్ట్రీ హిట్ పక్కాగా కొడుతోంది అనే చెప్పాలి.ఇక పూరి డబల్ ఇస్మార్ట్ తో సక్సెస్ కొడితే మాత్రం మళ్లీ టాప్ హీరో లు పూరి దగ్గర క్యూ కడతారు అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు అని ట్రేడ్ పండితులు అంటున్నారు…