Kushi Pre Release Business: విజయ్ దేవరకొండ-సమంతల రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఖుషి విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్ పలు భాషల్లో విడుదల కానుంది. ఖుషి చిత్రాన్ని విజయ్ దేవరకొండ, సమంత తమదైన శైలిలో ప్రమోట్ చేశారు. మొత్తంగా ఒక హైప్ క్రియేట్ చేశారు. విజయ్ దేవరకొండ హిట్ కొట్టి చాలా కాలం అవుతుండగా ఖుషిపై ఆశలు పెట్టుకున్నాడు. ఇక సమంతకు కూడా ఈ విజయం అవసరం. ఆమె గత చిత్రం శాకుంతలం డిజాస్టర్ అయ్యింది.
కాగా ఖుషి చిత్రం హిట్ కావాలంటే ఎన్ని కోట్లు కావాలో చూద్దాం. ఖుషి వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.. నైజాంలో రూ. 15 కోట్లకు అమ్మారు. ఇక సీడెడ్ లో రూ. 6 కోట్లు పలికింది. ఆంధ్రా హక్కులు రూ. 20 కోట్లకు విక్రయించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 41 కోట్లకు ఖుషి చిత్ర థియేట్రికల్ హక్కులు అమ్మారు. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా కలిపి మరో రూ. 4.5 కోట్లకు అమ్మారు. ఓవర్సీస్ హక్కులు రూ. 7 కోట్లకు విక్రయించారు.
వరల్డ్ వైడ్ ఖుషి చిత్రం రూ. 52.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 53.50 కోట్లు. కాబట్టి ఇంత మొత్తం వస్తే కానీ ఖుషి హిట్ అయినట్లు లెక్క. విజయ్ దేవరకొండ లైగర్ తో పోల్చితే ఖుషి తక్కువ బిజినెస్ చేసింది. ఈ చిత్ర హీరోయిన్ సమంత కూడా ఓ స్టార్. ఆమెకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కాబట్టి హిట్ టాక్ వస్తే ఈ టార్గెట్ చాలా సులభమే.
దర్శకుడు శివ నిర్వాణ ఖుషి చిత్రాన్ని తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ చిత్రం సమంత నిజ జీవిత కథ అంటూ ప్రచారం జరుగుతుంది. దానికి దర్శకుడు సమాధానం ఇచ్చాడు. దగ్గరగా ఉంటుంది కానీ, ఇది సమంత రియల్ లైఫ్ గురించి తీసిన చిత్రం కాదని సమాధానం చెప్పాడు. ప్రస్తుతం సమంత అమెరికాలో ఉన్నారు. అక్కడ కూడా ఖుషి చిత్ర ప్రమోషన్స్ లో సమంత పాల్గొంటుంది.
Recommended Video: