Vijay Devarakonda: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి అతి తక్కువ సమయం లోనే యూత్ లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ..తొలి సినిమా ‘పెళ్లి చూపులు’ తోనే సూపర్ హిట్ ని అందుకున్న విజయ దేవరకొండ..ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ మరియు ‘గీత గోవిందం’ వంటి భారీ హిట్స్ కొట్టి విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు..ఈ యువ హీరో నటన ని అందరూ ఇష్టపడుతారు కానీ ఈవెంట్స్ లో అతను మాట్లాడే యాటిట్యూడ్ మాటలకు యూత్ కనెక్ట్ అవుతారు కానీ, మిగిలిన ఆడియన్స్ లో బాగా నెగటివ్ అయ్యాడు.

కానీ ఈ హీరో చేసే సేవ కార్యక్రమాలు మాత్రం చాలా మందికి తెలియదు..కరోనా మహమ్మారి విలయతాండవం ఆడుతున్న సమయం లో ప్రజలకు సేవ చేసిన అతి తక్కువ మంది హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు..ఒక ప్రత్యేకమైన బృందం ని ఏర్పాటు చేసుకొని ఆయన ప్రతి జిల్లాలో సేవలు అందించారు.
ఇప్పుడు లేటెస్ట్ గా ఎవరికీ తెలియకుండా ఆయన చేసిన ఒక గొప్ప పని ఆయనపై మరింత గౌరవం పెంచేలా చేసింది..ఇటీవల ఒక ప్రముఖ హాస్పిటల్ నిర్వహించిన ‘ఆర్గాన్ డొనేషన్ క్యాంపు’ కి ముఖ్య అతిధిగా హాజరైన విజయ్ దేవరకొండ, హాస్పిటల్ యాజమాన్యం తో చర్చలు జరిపి తాను చనిపోయిన తర్వాత తన శరీరం లో ఉపయోగపడే ప్రతి అవయవం ని దానం చేస్తునట్టు సంతకం పెట్టాడు.
చనిపోయిన తర్వాత కూడా నలుగురికి ఉపయోగపడాలి అనుకునే విజయ్ దేవరకొండ గొప్ప మనసుని నెటిజెన్స్ పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు..ఇప్పటి వరుకు ఇలాంటి గొప్ప పనిని ఫిలిం ఇండస్ట్రీ సంబంధించిన ఏ హీరో కూడా చెయ్యలేదు..అలాంటి గొప్ప పని చేసి నలుగురికి ఆదర్శంగా నిలిచాడు విజయ్..భవిష్యత్తులో విజయ్ దేవరకొండ ని చూసి మిగిలిన హీరోలు కూడా అవయ దానం చేస్తారా లేదా అనేది చూడాలి.

ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే లైగర్ వంటి ఫ్లాప్ తర్వాత ఆయన ప్రముఖ దర్శకుడు ‘శివ నిర్వాణ’ తో ఖుషి అనే సినిమా చేస్తున్నాడు..సమంత ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది..అయితే ఆరోగ్య సమస్యల కారణంగా సమంత ప్రస్తుతం సర్గరీ చేయించుకుంటున్న నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది.