https://oktelugu.com/

విజయ్ ‘ఫైటర్’ లేటెస్ట్ యవ్వారాలు !

డేరింగ్ డైరెక్టర్ గా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేసే పూరి జగన్నాథ్ – ఎనర్జిటిక్ హీరోగా ఉన్నదాని కంటే కాస్త ఎక్కువ నటించే రామ్ కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది. చాల కాలం తరువాత ఇస్మార్ట్ శంకర్ అనే ఆ మధ్య వచ్చిన మూవీతో పూరి భారీ విజయాన్నే నమోదు చేసాడు. సినిమా రామ్ వల్లే హిట్ అయింది అన్నా.. హిట్ క్రెడిట్ మాత్రం పూరికి కూడా వచ్చింది. నిజానికి గత కొన్ని సినిమాలుగా పూరిలో మ్యాటర్ తగ్గిపోయిందనేది […]

Written By:
  • admin
  • , Updated On : August 12, 2020 / 10:03 AM IST
    Follow us on


    డేరింగ్ డైరెక్టర్ గా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేసే పూరి జగన్నాథ్ – ఎనర్జిటిక్ హీరోగా ఉన్నదాని కంటే కాస్త ఎక్కువ నటించే రామ్ కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది. చాల కాలం తరువాత ఇస్మార్ట్ శంకర్ అనే ఆ మధ్య వచ్చిన మూవీతో పూరి భారీ విజయాన్నే నమోదు చేసాడు. సినిమా రామ్ వల్లే హిట్ అయింది అన్నా.. హిట్ క్రెడిట్ మాత్రం పూరికి కూడా వచ్చింది. నిజానికి గత కొన్ని సినిమాలుగా పూరిలో మ్యాటర్ తగ్గిపోయిందనేది ఫిల్మ్ సర్కిల్స్ లో రెగ్యులర్ గా వినిపించే డైలాగ్. ఏది ఏమైనా పూరి పడిపోయి ప్లాప్ ల పాతాళంలో కొట్టుకుపోతున్న ప్రతిసారి.. ఏదొక హిట్ వచ్చి పూరిని నిలబెడుతుంది. ఇక ప్రస్తుతం తన తరువాత సినిమాని సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో ఫైటర్ అంటూ తన పాత చింతకాయ పచ్చడి గ్యాంగ్ డ్రామాతో మళ్లీ ఏదో ప్రయత్నం చేస్తున్నాడు.

    Also Read: బాలయ్య ముందు మార్కెట్ పెంచుకో !

    అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ కోసం సిద్ధం అవుతొంది. వచ్చే నెల 25 నుండి హైదరాబాద్ లోని అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో మొదలుకానుందని, ఈ షెడ్యూల్ లో క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ స్ తీయబోతున్నారని పూరి టీంలోని ఓ సభ్యుడు వ్యక్తపరిచిన లేటెస్ట్ అప్ డేట్. కాగా ఈ చిత్రం ఓ డాన్ అతని కొడుకుకి మధ్య నడుస్తోందని.. డాన్ కొడుకుగా విజయ్ దేవరకొండ.. డాన్ గా సునీల్ శెట్టి నటిస్తున్నాడట. సునీల్ శెట్టి ఈ సినిమాలో నటిస్తున్నాడని ఇంతవరకూ ఫైటర్ టీమ్ రివీల్ చేయలేదు. కానీ ఈ సినిమాలో ఈ మాజీ బాలీవుడ్ ఫేడ్ అవుట్ హీరో నటిస్తున్నాడు. విజయ్ దేవరకొండ – సునీల్ శెట్టి మధ్య వచ్చే సీన్స్ వెరీ ఇంట్రస్ట్ గా ఉంటాయని సమాచారం.

    Also Read: పవన్‌ చేస్తానంటే.. త్రివిక్రమ్‌ తీయనంటున్నాడు!

    ఏమైనా పూరి మాత్రం ఇలాంటి యాక్షన్ రొట్ట కొట్టుడు కథలను ఇంకా ఎన్నాళ్ళు రాస్తాడో.. ఇప్పటికైనా పూరి ట్రాక్ మారిస్తే.. మరో పదేళ్లు ఫామ్ లో ఉండొచ్చు. లేదు అంటే.. గతం గొప్పగా భవిష్యత్తు బాధగా ఉంటుంది. అన్నట్టు విజయ్ కొడుకుగా కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడట. అంటే అప్పటివరకు విజయ్ కి తానూ డాన్ కొడుకును అని తెలియదట. ఇక లాక్ డౌన్ తో వచ్చిన గ్యాప్ లో విజయ్ దేవరకొండ తన పాత్ర కోసం కొన్ని వర్కౌట్స్ చేశాడని.. చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కారణంగానే విజయ్ ఈ సినిమా కోసం తెగ కష్టపడుతున్నాడట. అనన్య హీరోయిన్ గా వస్తోన్న ఈ సినిమాను కరణ్ జోహార్, పూరి, ఛార్మిలు కలిసి నిర్మిస్తున్నారు.