https://oktelugu.com/

దేవరకొండ మామూలోడు కాదు.. సరికొత వ్యాపారం మొదలుపెట్టాడు

టాలీవుడ్ హీరోల్లో విజయ్ దేవరకొండ ప్రత్యేకం. స్టార్ డమ్ మాత్రమే కాదు అకౌంట్ నిండా డబ్బులు కూడ ఉండాలనే బాపతు. డబ్బు సంపాదనకు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తుంటారు. ఇప్పటికే పలు రంగాల్లో డబ్బు ఇన్వెస్ట్ చేసి లాభాలు గడిస్తున్నాడు. హీరోగా ఒక్కో సినిమాకు తక్కువలో తక్కువ 7 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే విజయ్ కొన్నేళ్ల క్రితం రౌడీ వేర్ పేరుతో క్లోతింగ్ బ్రాండ్ లాంచ్ చేసి ఆన్ లైన్ విక్రయాలు చేస్తున్నాడు. మరిన్ని సినిమా […]

Written By:
  • admin
  • , Updated On : October 30, 2020 / 07:32 PM IST
    Follow us on


    టాలీవుడ్ హీరోల్లో విజయ్ దేవరకొండ ప్రత్యేకం. స్టార్ డమ్ మాత్రమే కాదు అకౌంట్ నిండా డబ్బులు కూడ ఉండాలనే బాపతు. డబ్బు సంపాదనకు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తుంటారు. ఇప్పటికే పలు రంగాల్లో డబ్బు ఇన్వెస్ట్ చేసి లాభాలు గడిస్తున్నాడు. హీరోగా ఒక్కో సినిమాకు తక్కువలో తక్కువ 7 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే విజయ్ కొన్నేళ్ల క్రితం రౌడీ వేర్ పేరుతో క్లోతింగ్ బ్రాండ్ లాంచ్ చేసి ఆన్ లైన్ విక్రయాలు చేస్తున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ఆ తర్వాత నిర్మాతగా కూడ మారాడు. కింగ్ ఆఫ్ ది హిల్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇలా రెండు చేతుల సంపాదిస్తున్న ఆయన కొత్తగా ఇంకొక వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాడు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్ కంపెనీని రాష్ట్రానికి తీసుకొచ్చింది. త్వరలో వీరు ఇక్కడ మేకింగ్ ప్లాంట్ నిర్మించి వాహనాలు ఉత్పత్తి చేయనున్నారు.

    Also Read: మెగా హీరోల దండయాత్ర మొదలుకానుందా?

    ఇందులోనే విజయ్ పెట్టుబడులు పెట్టాడు. భవిష్యత్తు ఎలక్ట్రికల్ వాహనాలదే అని గట్టిగా నమ్మిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇది గనుక క్లిక్ అయితే విజయ్ మంచి లాభాల్ని గడించడం ఖాయం. ప్రస్తుతం ఈ డాషింగ్ హీరో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మాస్ హీరోగా ఎలివేట్ అవ్వాలనేది ఆయన ఉద్దేశ్యం.