https://oktelugu.com/

Hollywood: హీరోయిన్ మీద ఉన్న ఈర్ష్యతో 51 సార్లు పొడిచి చంపిన కిరాతకుడు ఎవరో తెలుసా..?

కొంత మంది స్టార్లు గా ఎదుగుతూ ఉంటే మరి కొంతమంది మాత్రం అవకాశాలు లేక ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోతూ ఉంటారు. ఇక మరి కొంతమంది మాత్రం స్టార్లుగా మారిన వాళ్లను చూస్తూ కుళ్ళుకుంటూ ఉంటారు.

Written By:
  • Gopi
  • , Updated On : May 9, 2024 / 10:35 AM IST

    Sharon Tate stabbed to death by Charles Manson gang

    Follow us on

    Hollywood: సినిమా ఇండస్ట్రీలో చాలామంది సినిమాలు చేసి సక్సెస్ అవ్వాలనే ఉద్దేశ్యం తో ఇండస్ట్రీకి వస్తారు. ఇక్కడ వచ్చిన అవకాశాలను వాడుకుంటూ ఇండస్ట్రీ లో ఎలాగైనా సరే సక్సెస్ ఫుల్ నటులుగా పేరు సంపాదించుకోవాలని చూస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంత మంది స్టార్లు గా ఎదుగుతూ ఉంటే మరి కొంతమంది మాత్రం అవకాశాలు లేక ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోతూ ఉంటారు. ఇక మరి కొంతమంది మాత్రం స్టార్లుగా మారిన వాళ్లను చూస్తూ కుళ్ళుకుంటూ ఉంటారు.

    ఇక ఇదిలా ఉంటే హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన 26 సంవత్సరాల షారోన్ టాటే దారుణంగా హత్య చేయబడిందనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అయిన చార్లెస్ మాన్సన్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఆమెను 51 సార్లు కత్తి తో పొడిచి పొడిచి మరి చంపారనే న్యూస్ ఒకటి అప్పట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించింది. ఆమె గర్భంతో ఉంది అని తెలిసిన కూడా చార్లెస్ అంతటి అరాచకానికి పాల్పడడం చూసిన ప్రతి ఒక్కరూ నిర్ఘాంతపోయారు. ఇక ఆ సంఘటనను గుర్తు చేసుకున్న ప్రతిసారి ఒళ్ళు గగ్గురుపొడుస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    ఇక చార్లెస్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఆమెను అంత కిరాతకంగా చంపడానికి గల కారణం ఏంటి అంటే సినిమా ఇండస్ట్రీలో షారోన్ అండ్ వాళ్ళ టీం మ్యూజిక్ విషయం లో చార్లెస్ కి పోటీగా వస్తున్నారనే ఈర్ష్యతో అలా చేశాడని తర్వాత విచారణలో తేలింది. ఇక షారోన్ 1943 జనవరి 24 వ తేదీన జన్మించింది. అలాగే 1969 ఆగష్టు 9వ తేదీన హత్య చేయబడింది.

    అయితే ఈ సంఘటన జరిగి చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికి ఆమె హత్య అనేది మరోసారి ఇప్పుడు తెరపైకి రావడం తో సోషల్ మీడియా మొత్తం ఆమె హత్య గురించిన న్యూస్ లే వైరల్ అవుతున్నాయి… ఇక ఇంతటి విషాద వార్తను వింటుంటేనే భాదగా ఉంది ఇక షారోన్ వాళ్ల ఫ్యామిలీ ఎలా భరించారో…