Vijay Devarakonda Liger: పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ.. విజయ్ ఫ్యాన్స్ లో రోజురోజుకు ఈ సినిమా పై ఆసక్తి రెట్టింపు అవుతుంది. అసలు ఈ సినిమాకి బిజినెస్ ఏ రేంజ్ లో జరుగుతుందని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.
వారి కోసం అదిరిపోయే అప్ డేట్ తో వచ్చాం. ‘లైగర్’ సినిమా ఎక్స్ క్లూజివ్ బిజినెస్ డీటెయిల్స్ ఇప్పుడు మీ కోసం. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను లైగర్ థియేటర్ రైట్స్ ను కొనుక్కున్నారు. అయితే, ఇక్కడ ఒక విశేషం ఉంది. లైగర్ సినిమా పాన్ ఇండియా సినిమా. అన్నీ సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా లైగర్ సినిమా రిలీజ్ కాబోతుంది.
Also Read: Modi Government: మోడీ సర్కార్ మరింత రెచ్చిపోవచ్చు.. ఈడీకి పగ్గాల్లేవంటున్న సుప్రీంకోర్టు
ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన కరుణ్ జోహార్ ఈ చిత్రాన్ని హిందీలో ఓన్ గా రిలీజ్ చేస్తున్నాడు. మిగిలిన అన్ని దక్షిణాది రాష్ట్రాలలో వరంగల్ శ్రీను రిలీజ్ చేయబోతున్నాడు. ఈ క్రమంలో వరంగల్ శ్రీను షాకింగ్ రేట్ కి లైగర్ దక్షిణాది రాష్ట్రాల థియేటర్ రైట్స్ కొనుక్కున్నాడు. ఇంతకీ ఆ రేట్ ఎంత అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా ?. ఏకంగా 70 కోట్లకు లైగర్ రైట్స్ కొన్నాడు వరంగల్ శ్రీను.
ఆంధ్ర ఏరియాను 30 కోట్ల రేషియోలో కొన్నాడు. వైజాగ్ ఏరియాను మాత్రం దర్శకుడు కొరటాల శివ సన్నిహితుడు సుధాకర్ 7 కోట్లకు కొన్నాడు. అలాగే ఈస్ట్ గోదావరి ఏరియాను డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి 4 కోట్లకు కొన్నాడు. మొత్తానికి లైగర్ సినిమాకి ఊహించని విధంగా బిజినెస్ జరుగుతుంది.
కానీ.. ఇప్పుడు ఉన్న బాక్సాఫీస్ లెక్కలను బట్టి.. 70 కోట్లు థియేటర్స్ నుంచి రాబట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని. కాకపోతే, మొత్తం అన్ని దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయనే భరోసా ఉంది. ఏది ఏమైనా ఈ సినిమాకి వచ్చే టాక్ ను బట్టే.. ఈ సినిమా భవితవ్యం తేలనుంది.
చివరగా ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పుకోవాలి. స్టార్ హీరోల రేంజ్ లో విజయ్ దేవరకొండ తన లైగర్ బిజినెస్ తో సరికొత్త రికార్డులు నమోదు చేశాడు.
Also Read: BJP Janasena: జనసేనతో పొత్తు.. ఏపీలో అధికారం కోసం బిగ్ స్టెప్ వేసిన బీజేపీ