Vijay Devarakonda- Samantha: సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాలో హీరోయిన్ గా ‘సమంత’ నటిస్తుంది. అయితే, ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌తో పాటు విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఖుషీ అనే టైటిల్ తో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఇక పోస్టర్ లో విజయ్ స్టైలిష్ లుక్ తో కనిపించగా.. సమంత సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది.

మొత్తానికి ఈ గులాబీ రంగు పోస్టర్ చాలా బాగుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 23, 2022న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే.. మొదటి షెడ్యూల్ ‘మే’ ఫస్ట్ వీక్ వరకూ జరగనుంది. మొదటి షెడ్యూల్ లో విజయ్ దేవరకొండ – సమంత పై రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేయనున్నారు.
Also Read: Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే ?
ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. సామ్ ఈ సినిమాలో చాలా బోల్డ్ గా నటించడానికి అంగీకరించింది. మొత్తానికి సమంత వరుస సినిమాలు ఒప్పుకుంటూ పోతుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండతో కూడా సామ్ మరో సినిమా చేస్తుండేసరికి మొత్తానికి మళ్ళీ సామ్ ఫామ్ లోకి వస్తోంది అని ఆమె ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.

పైగా సామ్ – విజయ్ దేవరకొండ గతంలో మహానటిలో కూడా కలిసి జోడీగా నటించారు. అయితే, ఇప్పటి సినిమాకి మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. కశ్మీర్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ లవ్ స్టోరీ ఇది. ఎలాగూ రొమాంటిక్ లవ్ స్టోరీ కాబట్టి.. సామ్ – విజయ్ మధ్య కూడా ఓ రేంజ్ రొమాన్స్ ఉంటుందట.
పైగా సామ్ తన కెరీర్ లోనే విజయ్ దేవరకొండ సినిమాను స్పెషల్ ఫిల్మ్ గా ట్రీట్ చేస్తోంది. కారణం ఆమెకు కథ బాగా నచ్చిందట. మొత్తమ్మీద ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది.
Also Read:OTT Releases This Week: ‘ఓటీటీ’ : ఈ వారం ‘ఓటీటీ’ చిత్రాల పరిస్థితేంటి ?
View this post on Instagram
View this post on Instagram
Recommended Videos:
[…] […]
[…] […]