Vijay: ఇలయదళపతి విజయ్‌కి తమిళనాటలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. తన స్టైల్ అండ్ మాన్లీ లుక్స్‌తో అందర్నీ తనవైపు తిప్పుకుని.. హీరో అంటే ఇలా ఉండాల్రా అనిపించుకునేలా చేశారు. తుపాకి, స్నేహితుడు, అన్న, సర్కార్ వంటి సూపర్ హిట్ చిత్రాలు అందించి.. ఇటీవలే మాస్టర్ సినిమాతో ప్రేక్షకులను కట్టిపడేసిన హీరో విజయ్.

ప్రస్తుతం మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా వస్తోన్న సినిమా బీస్ట్. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ ప్రెస్టేజియస్ మూవీలో హీరోయిన్గా పూజా హెగ్డే కనిపించనుంది. కాగా, ఇటీవలే ఆమె తన షూటంగ్‌ను పూర్తి చేసుకోగా.. తాజాగా విజయ్ కూడా తన షూట్‌ను కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాతోనే కోలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తోంది పూజా.
ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసిన సందర్భంగా హీరో విజయ్ దర్శకుడు నెల్సన్‌కు హగ్ ఇస్తూ తీసుకున్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తుంగా.. అందులోని ఓ పాటతో చిత్రబృందం సినిమాకు గుమ్మడికాయ కొట్టేసింది. గత నెలలో దర్శకుడు ఈ సినిమాకు సంబంధించిన ఫొటో నెట్టింట్లో షేర్ చేస్తూ.. వందోరోజు షూటింగ్ అని తెలిపారు. ఇప్పుడు ఏకంగా షూటింగ్ పూర్తయిందని పేర్కొన్నారు. ఇందులో సెల్వరాఘవన్ కూాడా కీలక పాత్ర పోషించారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది.