https://oktelugu.com/

కోట్లు కొల్లగొట్టడానికి మళ్ళీ వస్తున్నాడు !

మల్టీ టాలెంటెడ్ యాక్టర్ విజయ్‌ ఆంటోనీ హీరోగా ‘బిచ్చగాడు’ సినిమా ఎంత గొప్పగా సూపర్‌ హిట్‌ అయిందో కొత్తగా చెప్పక్కర్లేదు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తానికి ఆ సినిమా చాలా బాగా నచ్చింది. భారీ కలెక్షన్స్ ను రాబట్టింది ఆ సినిమా. బిచ్చగాడు కాస్త చివరకు కోట్లు కొల్లగొట్టాడు. మొత్తమ్మీద తెలుగు నాట ఆ సినిమా రికార్డులను కూడా సృష్టించింది. అసలు ఒక డబ్బింగ్ సినిమాకి ఆ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయని ఎవరూ ఊహించలేదు, పైగా […]

Written By:
  • admin
  • , Updated On : July 24, 2021 / 04:07 PM IST
    Follow us on

    మల్టీ టాలెంటెడ్ యాక్టర్ విజయ్‌ ఆంటోనీ హీరోగా ‘బిచ్చగాడు’ సినిమా ఎంత గొప్పగా సూపర్‌ హిట్‌ అయిందో కొత్తగా చెప్పక్కర్లేదు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తానికి ఆ సినిమా చాలా బాగా నచ్చింది. భారీ కలెక్షన్స్ ను రాబట్టింది ఆ సినిమా. బిచ్చగాడు కాస్త చివరకు కోట్లు కొల్లగొట్టాడు. మొత్తమ్మీద తెలుగు నాట ఆ సినిమా రికార్డులను కూడా సృష్టించింది.

    అసలు ఒక డబ్బింగ్ సినిమాకి ఆ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయని ఎవరూ ఊహించలేదు, పైగా సినిమాలో హీరో ఎవరో కూడా అప్పటికి చాలమందికి తెలియదు. అయినా రికార్డులు సృష్టించే రేంజ్ లో బిచ్చగాడు తెలుగు బాక్సాఫీస్ దగ్గర భారీగా రెచ్చిపోయాడు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద సినిమా స్థాయిలో హిట్ అవడం మామూలు విషయం కాదనే చెప్పాలి.

    అందుకే, ‘బిచ్చగాడు’ సినిమాకి కొనసాగింపుగా ‘బిచ్చగాడు 2’ సినిమాని తీసుకురాబోతున్నాడు విజయ్‌ ఆంటోనీ. పైగా తన స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండటం విశేషం. ఈ రోజు విజయ్ ఆంటోనీ పుట్టిన రోజు కావడంతో ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం.

    నిజానికి విజయ్ ఆంటోనీ మొదట సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత ఎడిటర్ గా మారాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఎడిటర్ గా ఫుల్ బిజీగా ఉన్న సమయంలో మళ్ళీ హీరో అవతారం ఎత్తాడు. మొత్తానికి హీరోగా విజయవంతం అయ్యాడు. అలాగే విజయ్ ఆంటోనీ ఈ సినిమాతో దర్శకుడిగా కూడా మారబోతున్నాడు. పైగా విజయ్ ఆంటోనీ ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంస్థే ఈ చిత్రాన్నీ నిర్మిస్తుంది.