Nayanthara- Vignesh Shivan Mother: నయనతార-విగ్నేష్ కోలీవుడ్ క్రేజీ కపుల్ గా ఉన్నారు. ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్న జంట ఈ ఏడాది వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నానుమ్ రౌడీ దాన్ మూవీకి విగ్నేష్ శివన్ దర్శకుడు. ఆ చిత్ర హీరోయిన్ గా నయనతార చేశారు. ఆ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. పలు మార్లు విగ్నేష్-నయనతార విడిపోతున్నారంటూ పుకార్లు వినిపించాయి.గతంలో నయనతార శింబు, ప్రభుదేవాలను ప్రేమించి విడిపోయారు. ఈ అనుభవాల రీత్యా విగ్నేష్ తో అయినా నయనతార పెళ్లి వరకు వెళుతుందా లేదా అనే సందేహాలు కలిగాయి.

అందరి సందేహాలు పటాపంచలు చేస్తూ నయనతార 2020 జూన్ నెలలో విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకున్నారు. మహాబలిపురంలో ప్రముఖుల మధ్య ఘనంగా జరిగింది. పెళ్ళైన మరుసటి రోజే ఆమె వివాదంలో చిక్కుకున్నారు. నూతన దంపతులుగా నయనతార-విగ్నేష్ తిరుమల శ్రీవారిని దర్శించారు. అయితే శ్రీవారి మాడవీధుల్లో నయనతార పాదరక్షలతో కనిపించారు. పవిత్ర స్థలంలో చెప్పులు ధరించిన నయనతారపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్యలకు సిద్ధమైన సంస్థ… ఆమె క్షమాపణలు చెప్పడంతో శాంతించింది.
అలాగే నెలల వ్యవధిలో కవల పిల్లలకు పేరెంట్స్ అయ్యామంటూ ప్రకటించి మరో వివాదంలో చిక్కుకున్నారు.సరోగసి నిబంధనలు నయనతార దంపతులు ఉల్లఘించారని భావించిన తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే తమకు ఐదేళ్ల క్రితమే అధికారికంగా వివాహం జరిగింది. తాము సరోగసీ నిబంధనలు పాటించామంటూ నయనతార దంపతులు ఆధారాలు సమర్పించారు. ప్రస్తుతం ఈ వివాదం సద్దుమణిగినట్లు తెలుస్తుంది.

కాగా పెళ్లయ్యాక నయనతార అత్తింటిలోనే ఉంటున్నారు. విగ్నేష్ పేరెంట్స్ తో కలిసి ఈ జంట ఉంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కోడలిపై విగ్నేష్ తల్లి మీనా కుమారి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే మా కోడలు బంగారం అన్న అభిప్రాయం వెల్లడించారు. మా అబ్బాయి స్టార్ డైరెక్టర్, కోడలు లేడీ సూపర్ స్టార్. నయనతారకు దయా హృదయం కూడా ఎక్కువ. ఇంట్లో పనిమనిషి ఒకరు అప్పు తీర్చలేక ఇబ్బందిపడుతున్న విషయం తెలిసి… రూ.4 లక్షలు ఇచ్చింది. పది మంది చేసే పని ఒక్కటే చేస్తుంది . ఎంతో ధైర్యం ఉన్న అమ్మాయి. బాగా కష్టపడుతుంది. ఇల్లు చక్కబెట్టడం, పెద్దవారిని జాగ్రత్తగా చూసుకుంటుంది, అంటూ మురిసిపోయింది.