బొద్దుగా ఉండే నటి ముద్దొచ్చేలా మారితే తప్పేమిటి ?.. ఏ..? ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ బికినీ వేసుకోకూడదా ? సరదాగా ప్రియుడితో బీచ్ కి వెళ్ళినప్పుడు అతనితో రొమాన్స్ చేయాలనుకోవడంలో తప్పేముంది ? హాస్యనటిగా గుర్తింపు తెచుకున్నంత మాత్రానా.. ఎప్పుడు కమెడియన్ గా ఉండిపోవాలా ? హీరోయిన్ గా గ్లామర్ గా కనిపిస్తే అభ్యంతరకరమైన కామెంట్స్ చేసి ఇబ్బంది పెడతారా ? ఇవ్వన్నీ క్యారెక్టర్ ఆర్టిస్ట్, హాస్యనటి విద్యుల్లేఖ రామన్ మనుసులోని బావాలు.
విద్యుల్లేఖ రామన్ కి తన స్నేహితుడి సంజయ్ ను కొన్ని రోజులు కిందట పెళ్లి చేసుకుంది. ఈ బొద్దు జంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లి.. సరదాగా గడుపుతుంది. అయితే, మాల్దీవుల ప్రకృతిలో పరవశించి పోయిన విద్యుల్లేఖ ఇక తట్టుకోలేక తాను కూడా గ్లామర్ గా మారిపోవాలని నిర్ణయించుకుంది. ఎలాగోలా భర్తను ఒప్పించి.. మొత్తానికి బికినీ వేసుకుని బీచ్ లో అటు ఇటు పొర్లుతూ కనిపిచింది.
ఈ క్రమంలోనే కొన్ని ఫోటోలు కూడా తీయించుకుంది. తాజాగా ఆ బికినీ ఫొటోను షేర్ చేస్తూ ‘ఏడాదికి రెండుసార్లు ఆరు నెలల పాటు సెలవులు కావాలి’ అని ఒక చిన్న మెసేజ్ కూడా పోస్ట్ చేసింది. అయితే కొందరు నెటిజన్లు మాత్రం ఆమె డ్రెస్సింగ్ స్టైల్ ను చూసి షాక్ అయ్యారు. నీకేం పోయేకాలం బికినీ వేస్తావా ? అని విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. ఓ నెటిజన్ ఐతే ‘విడాకులు ఎప్పుడు తీసుకుంటున్నారు’ అని కామెంట్ పెట్టాడు.
హ్యాపీగా హనీమూన్ లో ఉంటే విడాకుల గురించి అడుగుతావా ? అంటూ విద్యుల్లేఖ రామన్ తీవ్రంగా స్పందిస్తూ ఒక పోస్ట్ పెట్టింది. ‘అమ్మాయిలు ఎలా బట్టలు వేసుకోవాలో చెబుతూ కామెంట్స్ చేస్తున్న వారికి ఇదే నా మెసేజ్. నేను స్విమ్ సూట్ వేసుకున్నందుకే ఇలా అడుగుతున్నారని తెలుసు. ఆంటీ, అంకుల్స్ 1920ల నాటి కాలాన్ని వదిలి 2021కు రండి. సమస్య నెగెటివ్ కామెంట్స్ వల్ల కాదు. సమాజం ఆలోచించే తీరును బట్టి ఉంటుంది’ అంటూ పెద్ద మెసేజే పెట్టింది.
ఇక చివర్లో.. ‘మీ జీవితంలో అమ్మాయి అంటే కామవాంఛ తీర్చే సాధనమా ? మీరు ఏమి చేసినా అణిగి మణిగి, ఎలాంటి అవమానాన్నైనా భరిస్తూ ఉండే వస్తువా ? అమ్మాయిలోని వ్యక్తిత్వం మీకు కనిపించదా ? బతుకు.. బతకనివ్వు’’అంటూ పెద్ద స్పీచే ఇచ్చింది ఈ భారీ భామ.
