Vidaamuyarchi Twitter Review
Vidaamuyarchi Twitter Review: కోట్లాది మంది తమిళ ప్రజలు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన తలా అజిత్ ‘విడాముయార్చి’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందే ఒక హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ని చూడబోతున్నాము అనే అనుభూతి కలిగించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రాన్నిఫిబ్రవరి 6 వ తేదికి వాయిదా వేశారు. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేని ఆఫ్ బీట్ చిత్రం అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి అజిత్ క్రేజ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. కేవలం ఒక్క తమిళనాడు ప్రాంతం నుండే ఈ చిత్రానికి 17 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు బుకింగ్స్ ద్వారా వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ చిత్రానికి ఎంత క్రేజ్ ఉంది అనేది.
కాసేపటి క్రితమే ఓవర్సీస్ లోని ప్రీమియర్ షోస్ ముగిసాయి. ట్విట్టర్ లో టాక్ ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. అజిత్ లాంటి స్టార్ హీరో నుండి సినిమా విడుదల అవుతుంది అనగానే అభిమానులకు, ప్రేక్షకులకు కొన్ని డిమాండ్స్ ఉంటాయి. సినిమాటిక్ లిబర్టీ కోసం, కేవలం అభిమానుల కోసం కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ని జత చేస్తుంటారు దర్శకులు. కానీ ‘విడాముయార్చి’ చిత్రంలో అలాంటివేమీ చేయలేదు. కేవలం స్టోరీ ని ఆధారంగా తీసుకొనే స్క్రీన్ ప్లే నడిపించారు. ఎక్కడా కూడా హంగులు, ఆర్భాటాలు లేవు. ఫస్ట్ హాఫ్ మొత్తం అలా సాగిపోయింది. ఫస్ట్ హాఫ్ మొత్తం మీద ఒక్క ఫైట్ లేదు, సాంగ్ లేదు, భారీ ఎలివేషన్స్ లేవు, కానీ సినిమా స్క్రీన్ ప్లే మాత్రం చాలా ఎంగేజింగ్ గా ఉంది. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు అయితే ఆడియన్స్ కి రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తాయి.
ముఖ్యంగా కార్ చేసింగ్ యాక్షన్ సీక్వెన్స్ అయితే థియేటర్ లో చూసే ఆడియన్స్ కి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ని చూస్తున్న ఫీలింగ్ కలిగించింది అని చెప్పొచ్చు. ఫైట్స్ అద్భుతంగా కుదిరాయి. ఫస్ట్ హాఫ్ లో ఎలాంటి ఫైట్ సన్నివేశాలు లేవని ఫీల్ అయ్యే అభిమానులకు సెకండ్ హాఫ్ మాత్రం గూస్ బంప్స్ రప్పిస్తుంది అని చెప్పొచ్చు. అయితే ఈ ఫైట్స్ అన్ని ఏవో హీరో క్యారక్టర్ ని ఎలివేట్ చేయడానికి లేవు. కేవలం స్టోరీ డిమాండ్ చేసింది కాబట్టే ఉన్నాయి. అన్ని సందర్భానుసారంగా అలా సాగిపోతుంటాయి. అంతే కాకుండా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని కూడా మిస్ కాకుండా చూసుకున్నాడు డైరెక్టర్. ఓవరాల్ గా చెప్పాలంటే యాక్షన్ మూవీ లవర్స్ కి ఈ సినిమా ఒక విజువల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. అనిరుద్ అందించిన మ్యూజిక్ కూడా చాలా ప్లస్ అయ్యింది. తమిళ ప్రేక్షకులకు చాలా కాలం నుండి పెద్ద హీరో సినిమా విడుదల లేకపోవడంతో ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయి.
Decent second half. Overall a decent survival action thriller. The fight sequences in second half were choreographed in a realistic fashion and they are excellent. The story had more potential in second to explode if the director had capitalized well.
My major complaint is on…
— sharat (@sherry1111111) February 6, 2025
#Vidaamuyarchi First Half : Full Suspense Thriller
First Half No Action
Waiting for Action Packed Second Half#AjithKumar #VidaamuyarchiFDFS #VidaamuyarchiFromFeb6 pic.twitter.com/n97NGrc9o1
— ︎︎︎தல❤️ (@RamThala_Off) February 6, 2025
#VidaaMuyarchi #SecondHalf ❤️❤️❤️❤️. Such an highly quality making. It deserves every freaking appreciation
— Karthik (@meet_tk) February 6, 2025
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Vidaamuyarchi movie twitter review in telugu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com