Victory Venkatesh entry: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ లో ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) అనే చిత్రం శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఇందులో విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) కూడా ఒక కీలక పాత్ర పోషించబోతున్నాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ విషయాన్నీ స్వయంగా వెంకటేష్ ఒక ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు. ఆయన త్వరలోనే షూటింగ్ లో పాల్గొనబోతున్నారు అని మెగాస్టార్ చిరంజీవి కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఆ సమయం రానే వచ్చింది. నేడు ఈ సినిమా షూటింగ్ లో వెంకటేష్ మెగాస్టార్ చిరంజీవి తో కలిసి పాల్గొన్నాడు. అందుకు సంబంధించిన వీడియో ని కాసేపటి క్రితమే చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు.
ఈ వీడియో లో ఇద్దరు హీరోల పాత సినిమాలకు సంబంధించిన కొన్ని షాట్స్ ని ప్రారంభం లో చూపిస్తారు. ఆ తర్వాత చిన్నగా వెంకటేష్ కి సంబంధించిన గ్లింప్స్ షాట్స్ చూపిస్తారు. అప్పుడు చిరంజీవి ‘వెల్కమ్ మై డియర్ వెంకీ..మై బ్రదర్’ అని అంటాడు. చిరు సార్ మై బాస్ అని వెంకీ అంటాడు. ఈ వీడియో ఇరువురి హీరోల అభిమానులకు ఒక కనుల పండుగ లాగా అనిపించింది. సంక్రాంతి వరకు ఆగలేము, వెంటనే ఈ చిత్రాన్ని చూసేయాలి అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ చిరంజీవి కి వ్యక్తిగత సెక్యూరిటీ గార్డ్ గా కనిపిస్తాడని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఇందులో వెంకటేష్ కర్ణాటక ప్రాంతానికి చెందినవాడిగా కనిపిస్తాడని, ఆయన కేవలం కన్నడ లో తప్ప తెలుగు మాట్లాడలేదని, ఆ కారణం చేత వచ్చే ఫన్నీ సన్నివేశాలు థియేటర్స్ లో ఆడియన్స్ చేత కడుపుబ్బా నవ్వించేలా చేస్తాయని అంటున్నారు.
నిన్నటి తరం హీరోలలో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ పరంగా నువ్వా నేనా అనే రేంజ్ తలపడే చిరంజీవి, వెంకటేష్ కలిసి ఒక సినిమా చేస్తారని అభిమానులు వీళ్లిద్దరి పీక్ లో అసలు ఊహించి ఉండరు. కానీ పెద్ద వయస్సు వచ్చిన తర్వాత ఇప్పటికైనా వీళ్ళ క్రేజీ కాంబినేషన్ చూసే అదృష్టం దక్కినందుకు నిజంగా అభిమానులు లక్కీ అనే చెప్పాలి. వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం తో ఎలాంటి సెన్సేషన్ సృష్టించాడో మన కళ్లారా చూసాము. ఇక మెగాస్టార్ చిరంజీవి కి ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు, యూత్ మరియు మాస్ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో మన అందరికీ తెలిసిందే. ఇలాంటి బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్స్ కలిసి చేస్తున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని అద్భుతాలను నెలకొల్పుతుందో చూడాలి.
Welcoming my dear friend, Victory @VenkyMama to our #ManaShankaraVaraPrasadGaru Family
Let’s celebrate the joy this Sankranthi 2026 in theatres pic.twitter.com/3kITC2RlBU
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 23, 2025