Homeఎంటర్టైన్మెంట్'నారప్ప' ఫస్ట్ గ్లింప్స్ మీతో పంచుకోవడం గర్వంగా ఉంది - విక్టరి వెంక‌టేష్‌.

‘నారప్ప’ ఫస్ట్ గ్లింప్స్ మీతో పంచుకోవడం గర్వంగా ఉంది – విక్టరి వెంక‌టేష్‌.

Naarappa first look
‘ఎఫ్‌2’, ‘వెంకీమామ’ వంటి వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఆయ‌న లేటెస్ట్ మూవీ  ‘నారప్ప’  నుండి `గ్లిమ్స్‌ ఆఫ్ నార‌ప్ప`పేరుతో టీజ‌ర్‌ని విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌.

Also Read: చుక్కలు చూపించిన వెంకీ, వరుణ్ లపై దిల్ రాజు అలా పగతీర్చుకున్నాడా?

Happy Birthday Venky

విక్టరీ వెంకటేష్ ఫెరోషియస్ గా ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ ని హైలైట్ చేస్తూ చూపించి సినిమాలో యాక్షన్, ఎమోషన్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో ఈ గ్లింప్స్ ద్వారా ముందే హింట్ ఇచ్చారు మేక‌ర్స్‌. ఈ టీజ‌ర్‌ వెంక‌టేష్‌లోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తోంది. ముఖ్యంగా క‌త్తి ప‌ట్టుకుని న‌డుచుకుంటూ వ‌స్తూ  రౌద్రం పలికించిన తీరు అభిమానుల్ని ఉర్రూత‌లూగిస్తోంది. వెంక‌టేష్ సరికొత్త గెటప్, బాడీ లాంగ్వేజ్‌తో చాలా కాలం తర్వాత మాంచి మాస్ క్యారెక్టర్‌తో ప్రేక్షకాభిమానులను అలరించనున్నారని గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. న్యాచుర‌ల్ లుక్‌లో వెంక‌టేష్ `నారప్ప` పాత్ర‌లోకి పరకాయ ప్రవేశం చేశారని  అటు ప్రేక్ష‌కులు, ఇటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుండి  మంచి అప్రిసియేష‌న్ ల‌భిస్తోంది. ఇక మెలొడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజ‌ర్‌ని మ‌రింత ఎలివేట్ చేసింద‌న‌డంలో సందేహంలేదు. ఈ టీజ‌ర్‌తో సినిమాపై అంచ‌నాల‌ను భారీగా పెంచింది చిత్ర యూనిట్‌.  అంద‌రి అంచ‌నాల‌కు ధీటుగా ఈ చిత్రం రూపొందుతోంది. అనంత‌పురం షెడ్యూల్‌తో ఎన‌బైశాతం షూటింగ్ పూర్త‌య్యంది. నెక్స్ట్‌ షెడ్యూల్‌లో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ చిత్రీక‌రించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ..

Also Read: నారప్పగా వెంకీ అదరగొట్టాడు !

Glimpse of Narappa

విక్ట‌రి వెంక‌టేష్ మాట్లాడుతూ – “  ‘నారప్ప’ ఫస్ట్ గ్లింప్స్ మీతో పంచుకోవడం గర్వంగా ఉంది` అన్నారు.

సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న భారీ చిత్ర‌మిది. ఈ మూవీలో నార‌ప్ప స‌తీమ‌ణి సుంద‌ర‌మ్మ‌గా జాతీయ ఉత్తమ నటి ప్రియమణి న‌టిస్తోంది. `నార‌ప్ప` పెద్ద కొడుకు మునిక‌‌న్నాగా `కేరాఫ్ కంచరపాలెం`ఫేమ్ కార్తిక్ ర‌త్నం న‌టిస్తున్నారు.  ప్ర‌స్తుతం `గ్లిమ్స్‌ ఆఫ్ నార‌ప్ప` యూట్యూబ్‌లో నెం.1లో ట్రెండ్ అవుతోంది.

Venkatesh Birthday Special

విక్టరీ వెంకటేష్‌, ప్రియమణి, కార్తిక్ ర‌త్నం, రావు ర‌మేష్‌, రాజీవ్ క‌న‌కాల త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు,
సంగీతం: మణిశర్మ,
ఎడిటర్‌: మార్తాండ్ కె. వెంకటేష్‌,
ఆర్ట్‌: గాంధీ నడికుడికర్‌,
కథ: వెట్రిమారన్‌,
స్క్రిప్ట్ కన్సల్టెంట్: సత్యానంద్,
ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, విజయ్‌,
లిరిక్స్‌: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌ తేజ, అనంతశ్రీరామ్‌, కృష్ణకాంత్‌, కాసర్ల శ్యాం,
ఫైనాన్స్‌ కంట్రోలర్‌: జి.రమేష్‌రెడ్డి,
ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: రామబాలాజి డి.,
ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఏపీ పాల్‌ పండి,
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ శంకర్ డొంకాడ,
కో- ప్రొడ్యూసర్‌: దేవి శ్రీదేవి సతీష్‌
నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను
దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular