
బాలీవుడ్ లో బాక్సాఫీస్ కొల్ల గొట్టడంలోనైనా.. రెమ్యునరేషన్ తీసుకోవడం లోనైనా అక్షయ్ కుమార్ సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం పొందే హీరోల్లో కూడా.. ముందు వరసలో ఉన్నాడు అక్షయ్. తాజాగా సాజిద్ నడియావాలా రూపొందిస్తున్న ‘బచ్చన్ పాండే’ సినిమాకు అక్షయ్ కుమార్ ఏకంగా 99 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ పొందుతున్నాడు అనేది అనధికార సమాచారం.
Also Read: బాయ్ ఫ్రెండ్ ని కలవనిచ్చేవారు కాదు… ఆ వేదన చెప్పలేనిది !
ఇది తక్కువేనట!
ఒక్క సినిమాకు 99 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడా? అని నోరెళ్లబెడుతున్నారు ప్రేక్షకులు. కానీ.. దిమ్మ తిరిగే ఆన్సర్ వేరే ఉంది. ఈ రూ.99 కోత్లు కూడా తగ్గించిన పారితోషకమేనట. నిజానికి.. రూ.110 నుంచి 120 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే స్థాయిలో ఉందట అక్షయ్ కుమార్ మార్కెట్!
Alos Read: ప్రభాస్ ను వివాదాల్లోకి నెట్టిన సైఫ్ అలీ ఖాన్ !
కరోనా కాబట్టి..
అయితే.. కరోనా పరిస్థితుల నేపథ్యంలో నిర్మాతల మీద కాస్త దయ చూపి రెమ్యూనరేషన్ ను ఆ మేరకు తగ్గించాడట అక్షయ్. ఆ విధంగా.. తన రెమ్యూనరేషన్లో రూ.పది నుంచి ఇరవై కోట్ల రూపాయల మొత్తాన్ని తగ్గించి ఫైనల్ గా 99 కోట్ల రూపాయల పారితోషకం ఫిక్స్ చేశాడట.
మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్
ఓపెనింగ్స్ కేక..
అక్షయ్ నటించే సినిమాలకు భారీ ఓపెనింగ్సే వస్తూ ఉంటాయి. కానీ ఈ మధ్యనే వచ్చిన ‘లక్ష్మీ బాంబ్’ మాత్రం డిజాస్టర్ అయ్యింది. సౌత్ లో అందరినీ ఆకట్టుకున్న “కాంచన” మూవీనే లారెన్స్ హిందీలొ రీమేక్ చేసిన విషయం తెలిసిందే. కానీ.. అక్కడ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే.. నాన్ థియేటర్ రిలీజ్ కావడంతో.. ఆ సినిమా కలెక్షన్ల లెక్కలు తేలవు కాబట్టి. అక్షయ్ గ్రాఫ్ తగ్గిందని చెప్పే అవకాశాలు లేవు.