https://oktelugu.com/

Hero Venkatesh: నేను కేవలం నా గురించి మాత్రమే ఆలోచిస్తా.. షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో వెంకటేష్..!

విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే వెంకటేష్ నారప్ప చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకుని ప్రస్తుతం దృశ్యం 2 ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం ఈనెల 25న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా వెంకటేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 19, 2021 / 12:03 PM IST
    Follow us on

    విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే వెంకటేష్ నారప్ప చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకుని ప్రస్తుతం దృశ్యం 2 ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం ఈనెల 25న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా వెంకటేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

    ఈ క్రమంలోనే వెంకటేష్ మాట్లాడుతూ అదృష్టంకొద్దీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను అయితే ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరించి అభిమానిస్తున్నారు. వారు నా పై చూపే అభిమానం వల్లే నేను కొన్ని విభిన్న పాత్రలలో నటించ గలుగుతున్నాను అయితే నేను ఎప్పుడు నా ఇమేజ్ గురించి ఆలోచించను కేవలం నా గురించి మాత్రమే ఆలోచిస్తాను అంటూ ఈ సందర్భంగా వెల్లడించారు. తను నటించిన సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒకే విధంగా స్వీకరిస్తానని వెంకటేష్ చెప్పుకొచ్చారు.

    ఒక సినిమా ఫ్లాప్ అయితే తప్పు ఎక్కడ జరిగింది అనే విషయాన్ని తెలుసుకొని మరొక సినిమాలో ఆ తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటానని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలోనే దృశ్యం 3 కూడా రాబోతుందా అనే ప్రశ్న ఎదురుకాగా ఏమో ఆ విషయం గురించి నాకు తెలియదు. ఒకవేళ మరొక సినిమా వచ్చిన అది మరింత ఆలస్యం అవుతుందని సుమారు 4 సంవత్సరాల టైం పట్టొచ్చని అప్పటికి తెల్ల గడ్డంలో కనిపించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ ఈ సందర్భంగా వెంకటేష్ తన సినిమా గురించి వెల్లడించారు.