https://oktelugu.com/

Drushyam 2: ఇబ్బందుల్లో పడ్డ వెంకటేశ్ “దృశ్యం 2” సినిమా… కారణం ఏంటంటే ?

Drushyam 2: విక్టరీ వెంకటేష్ హీరోగా 2011లో విడుదలైన చిత్రం “దృశ్యం”. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మీనా నటించారు.  కుటుంబ నేపథ్యం మీద తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగులో వెంకటేష్ రీమేక్ చేసి తన ఖాతాలో సూపర్ హిట్ వేసుకున్నారు. తెలుగులో వచ్చిన దృశ్యం చిత్రానికి సీక్వెల్ గా దృశ్యం 2 తెరకెక్కించారు. దృశ్యం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 20, 2021 / 02:40 PM IST
    Follow us on

    Drushyam 2: విక్టరీ వెంకటేష్ హీరోగా 2011లో విడుదలైన చిత్రం “దృశ్యం”. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మీనా నటించారు.  కుటుంబ నేపథ్యం మీద తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగులో వెంకటేష్ రీమేక్ చేసి తన ఖాతాలో సూపర్ హిట్ వేసుకున్నారు. తెలుగులో వచ్చిన దృశ్యం చిత్రానికి సీక్వెల్ గా దృశ్యం 2 తెరకెక్కించారు. దృశ్యం సినిమా లో వెంకటేష్ తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం దృశ్యం 2 విడుదల అటు ఇటు గా ఉందని చెప్పాలి.

    దృశ్యం 2 త్వరలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు సర్వం సిద్ధం చేసుకున్న తరుణంలో ఈ చిత్రానికి మరో చిక్కు ఏర్పడింది అని చెప్పాలి. ఐతే అప్పట్లో ఈ చిత్రాన్ని డిస్నీ+హాట్ స్టార్ వాళ్లు కొన్నట్లుగా వార్తలొచ్చాయి. మీడియాలో కొన్ని రోజుల పాటు హాట్ స్టార్ పేరే వినిపించింది. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి అమేజాన్ ప్రైమ్ పేరు తెరపైకి వచ్చింది.

    ఇంకొక 5 రోజుల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి అడ్డుగా హాట్ స్టార్ సంస్థ లైన్లోకి వచ్చింది. ముందుగా తమతో డీల్ చేసుకుని… దాన్ని క్యాన్సిల్ చేయకుండానే మధ్యలో ప్రైమ్‌కు వెళ్లిపోవడం పట్ల ఆ సంస్థ ఆగ్రహంతో ఈ సినిమాపై లీగల్ నోటీసులు ఇచ్చిందని సమచారం. దృశ్యం 2 కు సంబంధించి సురేష్ బాబుతో పాటు ఇంకో ఇద్దరు నిర్మాతలు ఉండగా వారిలో ఒకరు హాట్ స్టార్ వాళ్లతో డీల్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ డీల్ సంగతి ఎటూ తేలకముందే ప్రైమ్ వాళ్లతో సురేష్ బాబు ‘దృశ్యం-2’ విడుదలకు ఒప్పందం చేసుకున్నట్లుగా సినివర్గాల్లో చర్చించుకుంటున్నారు. దీంతో హాట్ స్టార్ సంస్థ లీగల్ ఫైట్‌కు సిద్ధం అయిందట. చూడాలి మరి ఈ చిత్రం అనుకున్న డేట్ కి విడుదల అవుతుందా లేదా అని.