Vicky Kaushal
Vicky Kaushal : సినిమా ఇండస్ట్రీ అంటే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఇండస్ట్రీలో లైఫ్ అంత సాఫీగా సాగదు. చాలామంది ఇండస్ట్రీలో సక్సెస్ లు లేక ఏం చేయాలో తెలియక ఇండస్ట్రీని పట్టుకొని ఉంటున్నారు. అందుకే చాలామందికి ఇండస్ట్రీ కి రావడం ఇంట్రెస్ట్ ఉంటుంది. అయినప్పటికి దాన్ని కెరియర్ గా ఎంచుకోవడానికి మాత్రం భయపడుతూ ఉంటారు. ఇక్కడ ఎప్పుడు ఎవరికీ ఎలాంటి సక్సెస్ లు వస్తాయో ఎవ్వరికి తెలియదు. కాకపోతే కొంచెం రిస్క్ చేయాల్సి ఉంటుంది. ఆ రిస్క్ కి భయపడిన చాలా మంది ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు…
బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నా నటుడు ‘విక్కీ కౌశల్’ (Vicky koushal) రీసెంట్ గా ఛావా సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు…ఇక ప్రస్తుతం ఈ సినిమా భారీ రికార్డులను కొల్లగొట్టే దిశగా ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…ఇక విక్కీ కౌశల్ చిన్నతనంలో చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. మిడిల్ క్లాస్ లైఫ్ లో చాలి చాలని డబ్బులతో తన కోరికలను అదుపుచేసుకుంటూ వచ్చేవాడు. ఇక వాళ్ళ నాన్న మొదట వాచ్ మేన్ గా ఒక చిన్న ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఫైట్ మాస్టర్ కి అసిస్టెంట్ గా వెళ్లేవాడు…కొద్ది రోజుల్లోనే ఆయన కూడా ఫైట్ మాస్టర్ గా మారినప్పటికి పెద్ద సినిమాల్లో అవకాశాలు, చిన్న సినిమాలకు వచ్చిన డబ్బులు సరిపోక చాలావరకు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇలాంటి సందర్భంలోనే విక్కీ కౌశల్ తన ఖర్చులు తనే చూసుకోవాలనే ఉద్దేశంతో తనకు కాలేజీ లేని సమయాల్లో షూటింగ్ ల్లో లైట్ బాయ్ గా వెళ్లేవాడు.
దాని ద్వారా ఎంతో కొంత డబ్బులు సంపాదించుకొని తన ఖర్చులను తనే మెయింటెన్ చేసుకుంటూ వచ్చేవాడు. ఇలాంటి సందర్భంలోనే ఒకరోజు విక్కీ కౌశల్ లైట్ మెన్ గా వెళ్లడంతో వాళ్ళ నాన్న ఆ సినిమాకి ఫైట్ మాస్టర్ గా వచ్చాడు. ఇక అది చూసిన వాళ్ల నాన్న సినిమా ఇండస్ట్రీలో లైఫ్ అనేది సరిగ్గా ఉండదు. నువ్వు ఇండస్ట్రీ లోకి రావడం నాకు నచ్చడం లేదు.
బాగా చదువుకో అని చెప్పడంతో అప్పుడు విక్కీ కౌశల్ చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టాడు. మొత్తానికైతే చదువు పూర్తయిన తర్వాత అనురాగ్ కశ్యప్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఆ తర్వాత ఆయన ప్రోత్సాహంతోనే నటుడిగా మారాడు. ఇక ఆయన చేసిన సినిమాల్లో సంజు, ఉరి సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి.
మొత్తానికైతే లైట్ మెన్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసిన విక్కీ కౌశల్ ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. ఛావా (Chavaa)సినిమాతో ఖాన్ త్రయానికి సైతం పోటీ ఇచ్చే విధంగా మారాడు అంటూ బాలీవుడ్ మీడియా కొన్ని కథలను కూడా ప్రచురించింది. మరి ఏది ఏమైనా కూడా టాలెంట్ ఉన్నవాడు ఏదైనా చేయగలడని ప్రూవ్ చేసిన విక్కీ కౌశల్ ఫ్యూచర్ లో మరిన్ని మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని తన అభిమానులు సైతం కోరుకుంటున్నారు…