https://oktelugu.com/

Vettiyan OTT: ‘వెట్టియాన్’ ఓటీటీ విడుదల తేదీ ఖరారు..అదనపు సన్నివేశాలను జత చేసిన మేకర్స్..ఎందులో చూడాలంటే!

ఆ చిత్ర దర్శకుడి నుండి వస్తున్న సినిమా కావడంతో పాటుగా, సూపర్ స్టార్ రజినీకాంత్ బ్రాండ్ ఇమేజ్ కూడా తోడవ్వడం వల్ల మరో మాట లేకుండా ఈ చిత్రాన్ని 120 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31 న విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు కానీ, నవంబర్ 7 న విడుదల చేయబోతున్నట్టు ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.

Written By:
  • Vicky
  • , Updated On : October 25, 2024 1:51 pm
    Vettiyan Movie In OTT

    Vettiyan Movie In OTT

    Follow us on

    Vettiyan OTT: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘వెట్టియాన్’ ఇటీవలే దసరా కానుకగా విడుదలై మంచి టాక్ ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలోని కొన్ని అంశాలు మిస్ అవ్వడం అన్ని వర్గాలకు ఈ చిత్రం చేరువ కాలేకపోయింది. ఫలితంగా అటు తమిళంలో, ఇటు తెలుగులో భారీ డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఒకటిగా నిల్చింది ఈ చిత్రం. అయితే ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ప్రకటన కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు. డిజిటల్ రైట్స్ ని విడుదలకు ముందే అమెజాన్ ప్రైమ్ సంస్థ తెలుగు, హిందీ, తమిళం,మలయాళం మరియు కన్నడ భాషలకు కలిపి 120 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ చిత్ర దర్శకుడు జ్ఞాన్ వేల్ రాజా గతం లో సూర్య తో చేసిన ‘జై భీం’ చిత్రం థియేటర్స్ లో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవ్వడం, ఆ సినిమాకి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడం, చాలా కాలం వరకు అమెజాన్ ప్రైమ్ లో నాన్ స్టాప్ గా ట్రెండ్ అవ్వడం జరిగింది.

    ఆ చిత్ర దర్శకుడి నుండి వస్తున్న సినిమా కావడంతో పాటుగా, సూపర్ స్టార్ రజినీకాంత్ బ్రాండ్ ఇమేజ్ కూడా తోడవ్వడం వల్ల మరో మాట లేకుండా ఈ చిత్రాన్ని 120 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31 న విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు కానీ, నవంబర్ 7 న విడుదల చేయబోతున్నట్టు ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేయనుంది మూవీ టీం. అయితే ఓటీటీ వెర్షన్ లో కొన్ని అదనపు సన్నివేశాలను జత చేయబోతున్నారట మూవీ టీం. ప్రతీ సినిమాకి ఎడిటింగ్ సమయంలో కొన్ని సన్నివేశాలు తొలగించే విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి కూడా అదే చేసారు. రానా, రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చే ఒక సన్నివేశంతో పాటు, మరో రెండు ఫైట్ సన్నివేశాలను జత చేయబోతున్నారట.

    మరి దీనికి ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసినట్టే అని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి తెలుగు, తమిళ భాషలకు కలిపి 244 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కు అందుకోవాలంటే కచ్చితంగా 320 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టాల్సిందే. కానీ అది జరగలేదు,ఇక తెలుగు వెర్షన్ ని 17 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసారు. క్లోజింగ్ లో కేవలం 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇలా జైలర్ తర్వాత రజినీకాంత్ కి వరుసగా రెండు భారీ డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. ఇప్పుడు ఆశలన్నీ లోకేష్ కనకరాజ్ తో చేస్తున్న ‘కూలీ’ చిత్రం మీదనే పెట్టుకున్నారు రజినీకాంత్ అభిమానులు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.