Vettiyan Collections :  రజినీకాంత్ ‘వెట్టియాన్’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. పాజిటివ్ టాక్ తో ఇంత నష్టాలు ఇదే తొలిసారి!

మొదటి రోజు వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయి అనుకునే, కనీసం 70 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు. ఇక తెలుగు రాష్ట్రాలకు ఈ సినిమాకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 17 కోట్ల రూపాయలకు జరిగింది. వారం రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమాకి తెలుగు వెర్షన్ లో 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

Written By: Vicky, Updated On : October 17, 2024 6:56 pm

Vettiyan Collections

Follow us on

Vettiyan Collections:  సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘వెట్టియాన్’ ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఎందుకో ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో వసూళ్లు మాత్రం రావడం లేదు. రజినీకాంత్ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పుడల్లా బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యేది. ‘జైలర్’ చిత్రానికి కేవలం సౌత్ మార్కెట్ సహకారంతో 650 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ రికార్డు ని అనేక పాన్ ఇండియన్ సినిమాలు హిందీ మార్కెట్ తో కూడా బద్దలు కొట్టలేకపోయాయి. అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రజినీకాంత్ సినిమాకి అభిమానులు బంపర్ ఓపెనింగ్ ఆశిస్తారు, కానీ ఆ ఓపెనింగ్ ఈ చిత్రానికి దక్కలేదు.

మొదటి రోజు వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయి అనుకునే, కనీసం 70 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు. ఇక తెలుగు రాష్ట్రాలకు ఈ సినిమాకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 17 కోట్ల రూపాయలకు జరిగింది. వారం రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమాకి తెలుగు వెర్షన్ లో 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి సూపర్ హిట్ అవ్వాలంటే మరో 7 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాలి. ఈ వీకెండ్ లో డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడితే 12 కోట్ల రూపాయిల వరకు తెలుగు వెర్షన్ షేర్ వసూళ్లు చేరుకోవచ్చు. తెలుగు వెర్షన్ మాత్రమే కాకుండా, తమిళ వెర్షన్ తో కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము. తమిళ నాడు ప్రాంతం లో ఈ చిత్రానికి 83 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాగా, కర్ణాటక లో 20 కోట్ల రూపాయిల గ్రాస్, కేరళ లో 14 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

అలాగే తెలుగు రాష్ట్రాల్లో 18 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాగా, రెస్ట్ ఆఫ్ ఇండియా లో 5 కోట్లు, ఓవర్సీస్ లో 70 కోట్ల రూపాయిలు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 210 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. షేర్ 100 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని టాక్. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 160 కోట్ల రూపాయలకు జరిగింది. అంటే బ్రేక్ ఈవెన్ మార్కుకి మరో 60 కోట్ల రూపాయిల షేర్, వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావాలి అన్నమాట. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే ఫుల్ రన్ లో మరో 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావొచ్చు కానీ, బ్రేక్ ఈవెన్ అసాధ్యం అనే చెప్పాలి. కాబట్టి ఈ చిత్రానికి తక్కువ లో తక్కువగా 40 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు రావొచ్చు.