https://oktelugu.com/

 Vettiayan Collection : రజినీకాంత్ ‘వెట్టియాన్’ 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..బ్రేక్ ఈవెన్ మార్కుకి అతి చేరువలో సూపర్ స్టార్!

రజిని రేంజ్ కి ఇది చాలా తక్కువే, మొదటి రోజు రావాల్సిన వసూళ్లు మూడు రోజులకు వచ్చింది. ఇక నేడు ఆదివారం అవ్వడంతో ఈ సినిమాకి మరో 25 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అదనంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఓవర్సీస్ మార్కెట్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

Written By:
  • Vicky
  • , Updated On : October 13, 2024 / 03:13 PM IST

    Vettiayan Collection

    Follow us on

    Vettiayan Collection:  సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ చిత్రం ‘వెట్టియాన్’ ఇటీవలే విడుదలై మంచి టాక్ ని తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి ‘జైలర్’ రేంజ్ వసూళ్లు అయితే రావడం లేదు కానీ, డీసెంట్ స్థాయి వసూళ్లు వస్తున్నాయి. మొదటి రోజు వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొట్టడం ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలకు వెన్నతో పెట్టిన విద్య లాగ అయిపోయింది. ఈ చిత్రానికి ముందు తమిళం లో విడుదలైన హీరో విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ చిత్రం మొదటి రోజు 120 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది, ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం 140 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది, కానీ వెట్టియాన్ చిత్రం మొదటి రోజు కేవలం 70 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది.

    టాక్ డీసెంట్ గానే ఉండడంతో రెండవ రోజు, మూడవ రోజు కూడా మంచి వసూళ్లు వచ్చాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి తెలుగు, తమిళ భాషలకు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 153 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చినట్టు చెప్తున్నారు. తెలుగు లో ఈ చిత్రానికి ఇప్పటికి వరకు 11 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 6 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు తెలుగు వెర్షన్ కి అవసరం ఉన్నాయి. అలాగే ప్రాంతాల వారీగా ఈ సినిమాకి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే తమిళనాడు లో మూడు రోజులకు గానూ 60 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాబట్టగా, కర్ణాటక లో 15 కోట్ల రూపాయిలు, కేరళలో 10 కోట్ల రూపాయిలు, రెస్ట్ ఆఫ్ ఇండియా లో 2 కోట్ల 60 లక్షల రూపాయిలు, ఓవర్సీస్ లో 40 కోట్ల రూపాయిలు, మొత్తం మీద 153 కోట్ల రూపాయిల గ్రాస్, 75 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

    రజిని రేంజ్ కి ఇది చాలా తక్కువే, మొదటి రోజు రావాల్సిన వసూళ్లు మూడు రోజులకు వచ్చింది. ఇక నేడు ఆదివారం అవ్వడంతో ఈ సినిమాకి మరో 25 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అదనంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఓవర్సీస్ మార్కెట్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ ఈ సినిమాకి రజినీకాంత్ కంచు కోట ప్రాంతాలుగా పిలవబడే మలేసియా, సింగపూర్ వంటి ప్రాంతాల్లో ఆశించిన స్థాయి వసూళ్లు రావడం లేదు. ఇది ట్రేడ్ కి బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 86 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది.