https://oktelugu.com/

Vettian Movie Collection : వెట్టియాన్’ తెలుగు వెర్షన్ 2 రోజుల వసూళ్లు.. లాభాలు రావాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలో తెలుసా?

తమిళ టైటిల్ ని తెలుగులో కూడా కొనసాగించడం వల్ల వసూళ్ల మీద ప్రభావం చూపిస్తుందేమో అని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ మొదటి రోజు ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి ఓపెనింగ్ తెలుగు రాష్ట్రాల నుండి దక్కింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 11, 2024 / 07:47 PM IST

    Vettian Movie Collection

    Follow us on

    Vettian Movie Collection :  సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘వెట్టియాన్’ నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ‘జై భీం’ ఫేమ్ జ్ఞాన్ వేల్ రాజా దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఈమధ్య విడుదలైన రజినీకాంత్ సినిమాలలో కొత్త రకంగా ఉందని, సోషల్ మెసేజి కూడా అదిరిపోయిందని అంటున్నారు. రజినీకాంత్ తో పాటు, ఇందులో కీలక పాత్ర పోషించిన ఫహాద్ ఫాజిల్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషలకు కలిపి 75 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రజిని రేంజ్ కి ఇది చాలా తక్కువ వసూళ్లే, కానీ ఆ డైరెక్టర్ తో ఇలాంటి వసూళ్లు రాబట్టడం గ్రేట్ అనే చెప్పాలి.

    ఇకపోతే తమిళ టైటిల్ ని తెలుగులో కూడా కొనసాగించడం వల్ల వసూళ్ల మీద ప్రభావం చూపిస్తుందేమో అని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ మొదటి రోజు ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి ఓపెనింగ్ తెలుగు రాష్ట్రాల నుండి దక్కింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం మొదటి తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, అలాగే 2 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాబట్టిందని అంటున్నారు. అందులో నైజాం ప్రాంతం నుండి 1 కోటి 5 లక్షల రూపాయిలు కాగా, ఆంధ్ర నుండి 1 కోటి 15 లక్షలు, సీడెడ్ ప్రాంతం నుండి 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. మొదటి రోజు డీసెంట్ స్థాయి ఓపెనింగ్ ని దక్కించుకున్న ఈ చిత్రం, రెండవ రోజు కూడా అదే స్థాయి వసూళ్లను సొంతం చేసుకుంది. మార్నింగ్, మ్యాట్నీ షోస్ నుండి పెద్దగా వసూళ్లు రాకపోయినప్పటికీ, సాయంత్రం షోస్ నుండి హౌస్ ఫుల్స్ నమోదు అవ్వడం తో రెండవ రోజు కూడా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

    అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కచ్చితంగా 17 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలట. లాంగ్ వీకెండ్ అవ్వడంతో బ్రేక్ ఈవెన్ మార్కు ని అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని అంటున్నారు ట్రేడ్ పండితులు. రేపు దసరా పండుగ కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజుకంటే ఎక్కువ వసూళ్లు వచ్చే అవకాశం ఉందట. రేపు ఒక్కరోజు బలంగా నిలబడితే టాక్ పాజిటివ్ గానే ఉంది కాబట్టి ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ రాబడుతుందని బలంగా నమ్ముతున్నారు బయ్యర్స్. మరి ఈ చిత్రం ఆ స్థాయి వసూళ్లను రాబడుతుందో లేదో చూడాలి, వీకెండ్ కి రెండు వెర్షన్స్ కి కలిపి వరల్డ్ వైడ్ కి 200 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకునే అవకాశం ఉంది.