Devara Movie Collection : ‘దేవర’ 14 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. అనేక ప్రాంతాల్లో మొదటి వారాన్ని మించిపోయిన 2వ వారం వసూళ్లు!

రెండు వారాలకు గాను ఈ చిత్రం 170 కోట్ల రూపాయిల షేర్ మార్కుకి అతి దగ్గరగా ఉంది. 14 వ రోజు ఈ చిత్రానికి 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. జీఎస్టీ తో కలిపి కోటి రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. రెండు వారాల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 125 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Written By: Vicky, Updated On : October 11, 2024 7:49 pm

Devara Movie Collection

Follow us on

Devara Movie Collection :  ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ బాక్స్ ఆఫీస్ వసూళ్ల జోరు రెండు వారాలు అయినా కూడా ఇసుమంత కూడా తగ్గలేదు. ఓపెనింగ్స్ లో కళ్ళు చెదిరే వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ చిత్రం, లాంగ్ రన్ లో కూడా ఇంతకు ముందు ఎన్టీఆర్ అభిమానులు చూడని రేంజ్ లో ఈ సినిమా విజయవంతంగా థియేటర్స్ లో నడుస్తుంది. ఆరేళ్ళ పాటు సోలో సినిమా కోసం ఎదురు చూసిన ఎన్టీఆర్ అభిమానులకు ఈ సినిమా ఒక ఫుల్ మీల్స్ లాగా అనిపించింది. సెకండ్ హాఫ్ యూత్ ఆడియన్స్ కి పెద్దగా నచ్చలేదు కానీ, ఫ్యామిలీ మరియు మాస్ ఆడియన్స్ కి మాత్రం ఈ చిత్రం తెగ నచ్చేసింది. అందుకే రెండవ వారం లో గత 7 సంవత్సరాలలో ఏ సినిమాకి రానటువంటి వసూళ్లు, ఆక్యుపెన్సీలు ఈ చిత్రానికి నమోదు అయ్యాయి.

ఇక రెండు వారాలకు గాను ఈ చిత్రం 170 కోట్ల రూపాయిల షేర్ మార్కుకి అతి దగ్గరగా ఉంది. 14 వ రోజు ఈ చిత్రానికి 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. జీఎస్టీ తో కలిపి కోటి రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. రెండు వారాల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 125 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. దసరా హాలిడేస్ అక్టోబర్ 3 నుండి ఇవ్వడం తో థియేటర్స్ ఫ్యామిలీ ఆడియన్స్ తో కళాకలాడిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ సినిమాకి రేపటి దసరా రోజున 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఇది ఇలా ఉండగా కర్ణాటక ప్రాంతంలో దేవర చిత్రం చరిత్ర తిరగరాసింది అంటున్నారు. ఇప్పటి వరకు రెండు వారాలకు కలిపి ఈ సినిమాకు దాదాపుగా 18 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఇది సాధారణమైన విషయం కాదు. కర్ణాటక ప్రాంతం ఎన్టీఆర్ కి కంచుకోట అని ఎందుకు అంటారో ఇప్పుడు అందరికీ అర్థమైంది.

అలాగే ఓవర్సీస్ ప్రాంతం లో ఈ చిత్రానికి రెండు వారాలకు కలిపి 31 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే 60 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ అన్నమాట. ఓవరాల్ గా చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి అన్ని భాషలకు కలిపి 170 కోట్ల రూపాయలకు దగ్గరగా వచ్చాయట. నైజాం, సీడెడ్ , ఓవర్సీస్, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ మార్కుని ఈ చిత్రం అందుకుంది. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్ళు రాబట్టాల్సి ఉంటుంది. రేపు దసరా, అలాగే ఎల్లుండి ఆదివారం కావడంతో బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా వస్తుందని, ఫుల్ రన్