RGV Vyooham movie : సినిమాలు ఎలా తీసినా కూడా రాంగోపాల్ వర్మలో ఓ టాలెంట్ ఉంది. సినిమా కథా, కథనానికి తగ్గ నటీనటులను ఎంపిక చేసుకోవడంలో వర్మ సిద్ధహస్తుడు అని పేరుంది. నాడు అనంతపరం పరిటాల రవి కథాంశం నుంచి మొదలుపెడితే నేటి జగన్ బయోగ్రఫీ ‘వ్యూహం’ వరకూ వర్మ నటీనటులను చాలా బాగా ఎన్నుకుంటారు.
తాజాగా వర్మ ‘వ్యూహం’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో జగన్ పాత్రధారిగా తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన ‘అజ్మల్ అమీర్’ నటిస్తుండగా.. వైఎస్ భారతి పాత్రలో అచ్చం ఆమె లాగానే ఉండే ‘మానస రాధాకృష్ణన్ నటిస్తోంది.
చంద్రబాబు అహంకారానికి.. జగన్ ఆలోచనలకు మధ్య జరిగే యుద్ధం ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు.
ఈరోజు విజయవాడ నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ గ్రౌండ్ లో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఇందులోకి జనాలను ఆహ్వానించారు.
ఇక ఈ వేదికపై కేసీఆర్, స్టాలిన్ లను పోలిన నటులను అచ్చుగుద్దినట్టు దించేశాడు వర్మ. కేసీఆర్ ను ఎంచుకున్న నటుడిని చూస్తే అలానే ఉన్నాడని అనిపించింది. ఇక షర్మిల పాత్రధారి అచ్చం అలాగే కనిపించింది. మొత్తంగా పాత్రధారులను వాడడంలో వర్మను మించిన వారు లేరని అనిపించింది.
https://twitter.com/nsiva86/status/1689473204060880896?s=20
https://twitter.com/iamSidde/status/1689221055259508736?s=20