Venu Swamy comments on Ram Charan: చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు రామ్ చరణ్… తను చేసిన మొదటి సినిమాతోనే నటుడిగా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడు… రెండో సినిమా అయిన మగధీరతో ఇండస్ట్రీ హిట్ ను సాధించి తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకు పోటీ ఎవరు లేరనే రేంజ్ లో తను తాను ప్రూవ్ చేసుకున్నాడు. అలాంటి రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా అవతరించడమే కాకుండా ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో పంచవ్యాప్తంగా తన పేరును ఎలివేట్ చేసుకున్నాడు… ఇక రీసెంట్ గా ఆయనకి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు… అందులో ఒకరు పాప, మరొకరు బాబు కావడం విశేషం…
ఇంతకుముందు రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు ‘క్లీంకార’ అనే పాప జన్మించింది… ఈ పాప పుట్టినప్పుడు ప్రముఖ జ్యోతిష్యుడు అయిన వేణు స్వామి క్లీంకార చాలా గొప్ప పొజిషన్ కి వెళ్తుందని మెగా ఫ్యామిలీ తలెత్తుకునేలా తను చేస్తుందంటూ కామెంట్లు చేశాడు. అలాగే ఇక రామ్ చరణ్ కి మరో పాప గాని, బాబు గాని పుట్టే అవకాశం లేదు అంటూ మాట్లాడాడు…
అప్పుడు వేణు స్వామి మాటల మీద సీరియస్ అయిన అభిమానులు ఇప్పుడు రామ్ చరణ్ కి వారసుడు పుట్టడంతో వేణు స్వామి మాట్లాడిన మాటలని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అలాగే అతని మీద ఫైర్ అవుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కొడుకు పుట్టడం పట్ల చాలామంది సినిమా సెలబ్రిటీలు కంగ్రాట్యులేషన్స్ చెబుతున్నారు.
ఇక మెగా అభిమానులు మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్లి మరి వాళ్ళకి విశేష్ చెబుతూ వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి యొక్క లెగసిని కంటిన్యూ చేయడానికి రామ్ చరణ్ ఎలాగైతే ఉన్నాడో , రామ్ చరణ్ స్టార్ డమ్ ను ముందుకు తీసుకెళ్లడానికి తనకి ఒక వారసుడు జన్మించడం అనేది మెగా ఫ్యామిలీ మొత్తాన్ని ఆనందంలో ముంచేత్తుతుందనే చెప్పాలి…
