Venu Swamy: సినీ సెలబ్రిటీల జాతకాలు అంటూ వేణు స్వామి(Venu Swamy) గతంలో ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన చెప్పేవి నూటికి రెండు మూడు జరిగితే, మిగిలినవన్నీ జరగలేదు. కానీ జరిగిన ఆ రెండు మూడు సంఘటనలు గురించే ప్రచారం చేస్తూ, కొత్తగా పెళ్ళైన సినీ సెలెబ్రిటీలపై, అదే విధంగా అప్పుడే పుట్టిన సినీ సెలబ్రిటీల బిడ్డలపై సంచలన వ్యాఖ్యలు చేస్తుండేవాడు. శుభమా అని అక్కినేని నాగ చైతన్య, శోభిత పెళ్లి చేసుకుంటే, వాళ్లిద్దరూ 2028 లో విడిపోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. దీంతో ఆయన తీవ్రమైన పరిణామాలు ఎదురుకోవాల్సి వచ్చింది. అప్పటి నుండి సినీ సెలబ్రిటీల జాతకాలు చెప్పడం మానేసాడు. అయితే గతం లో రామ్ చరణ్(Global star Ram Charan), ఉపాసన దంపతులకు క్లిన్ కారా పుట్టినప్పుడు వేణు స్వామి చేసిన కొన్ని వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి.
ఆయన మాట్లాడుతూ ‘క్లిన్ కారా తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులకు సంతానం ఉండకపోవచ్చు. అంతే కాదు చిరంజీవి కుటుంబం లో ఇక మగ సంతానం కలగడం అసాధ్యమే’ అని చెప్పుకొచ్చాడు. కానీ క్లిన్ కారా తర్వాత ఇప్పుడు ఉపాసన కవలపిల్లలకు జన్మనిచ్చింది. మగబిడ్డ సంతానం కలగదు అని చెప్పాడు, కవలపిల్లల్లో ఒక మగ సంతానం కూడా కలిగింది. వేణు స్వామి చెప్పిన వంద అబద్ధపు జాతకాల్లో ఇది కూడా ఒకటి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ చెప్పుకొస్తున్నారు. వేణు స్వామి కి అసలు జాతక శాస్త్రం తెలియదని, ఆయన చెప్పిన వాటిల్లో సమంత, నాగ చైతన్య విడిపోవడం ఒక్కటే జరిగిందని, ఆ తర్వాత ఆయన చెప్పినవేమి జరగలేదని , కేవలం చీకట్లో బాణాలు వెయ్యడం మాత్రమే ఆయనకు తెలుసనీ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ ఇక జీవితం లో హిట్ కొట్టలేడు, ఆయన మీద నిర్మాతలు వందల కోట్లు బడ్జెట్ ఖర్చు చేసి వృధా చేయకండి అని అప్పట్లో చెప్పాడు.
కానీ ప్రభాస్ ‘సలార్’, ‘కల్కి’ చిత్రాలతో భారీ బ్లాక్ బస్టర్స్ ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత 2024 లో మళ్లీ జగన్ సీఎం అవుతాడు, పవన్ కళ్యాణ్ మరోసారి ఎమ్మెల్యే గా ఓడిపోతాడు, ఇది జరగకపోతే జాతకాలు చెప్పడం మానేస్తా అని ఛాలెంజ్ విసిరాడు, చివరికి ఏమైందో మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు రీసెంట్ గా రామ్ చరణ్, ఉపాసన సంతానం పై చేసిన కామెంట్స్ కూడా తప్పు అయ్యాయి. ఇక వేణు స్వామి ని నమ్మే జనాలు ఉండరని, ఆయన ఇక సైలెంట్ గా ఇంట్లో కూర్చొని ఈ వయస్సులో రిలాక్స్ అవ్వడం మంచిది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.