venkatesh: విక్టరీ వెంకటేశ్ కూడా ఓటీటీ ప్లాట్‌ఫాంలో హోస్టుగా అలరించనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ‘ఆహా’లో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ టాక్ షోతో బాలకృష్ణ హోస్టుగా అదరగొడుతున్నారు. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ ‘ఆహా’ కోసం ఓ సరికొత్త ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నారని.. ఆ ప్రోగ్రామ్ కి వెంకటేశ్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ కూడా త్వరలోనే రాబోతుందట.

ఇక వెంకటేష్ లాస్ట్ సినిమా దృశ్యం 2. ఎమోషనల్ సస్పెన్స్ డ్రామాగా ఆకట్టుకున్న ‘దృశ్యం’ నుంచి సీక్వెల్ గా వచ్చిన ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ లో వెంకటేష్ సరసన మీనా ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా ఓటీటీ బాట పట్టి.. డిజిటల్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఈ మధ్య అమెజాన్ ప్రైమ్ లో ఒక తెలుగు సినిమాకు ఈ సినిమాకి వచ్చిన స్థాయిలో వ్యూస్ రాలేదు అట. పైగా వెంకీ కెరీర్ లో భారీ ప్రేక్షక ఆదరణ పొందిన సినిమాగా ఈ సినిమాకి రికార్డ్ క్రియేట్ చేసింది.
Also Read: AP Politics: ఏపీలో ఎవరితో పొత్తులు.. ఎవరికి లాభం?

మొత్తానికి దృశ్యం 2 కథనం చాలా బాగుంది. అందుకే ఈ సినిమాని ప్రేక్షకులు కూడా బాగా ఆదరించి ఉంటారు. హత్య కేసు నుంచి రాంబాబు తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఏం చేశాడు ? అనే కోణంలో రివీల్ అయ్యే ట్విస్ట్ లు, ఎమోషన్స్, ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి కథలో వచ్చే మలుపులు, మరియి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలోని మెయిన్ హైలైట్స్. సినిమా చూడని వారు ఎవరైనా ఉంటే అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు. ఏది ఏమైనా వెంకటేష్ హోస్ట్ గా మారబోతుండటం విశేషమే.
మొత్తానికి వెంకీ బాలయ్యను ఫాలో అవుతున్నాడు. అయితే వెంకీ, బాలయ్య స్థాయిలో సక్సెస్ అవుతాడా ? నిజానికి ఇండియన్ ఓటీటీ షోలలోనే బాలయ్య షో నంబర్ వన్ షో అయింది. బాలయ్య నెంబర్ వన్ హోస్ట్ గా కూడా నిలిచాడు. మరి ఈ స్థాయిలో వెంకీ సక్సెస్ అవుతాడా ? చూడాలి.
[…] Also Read: హోస్ట్ గా వెంకీ.. బాలయ్యలా సక్సెస్ అవు… […]
[…] RGV: ఏపీలో సినిమా టికెట్ ధరల విషయంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఏపీ మంత్రులకు మధ్య ట్విట్టర్ వార్ నడిచిన విషయం తెలిసిందే. మంత్రి పేర్ని నానికి ఆర్జీవీ ఏకంగా పదికి పైగా ప్రశ్నలు సంధించి పెనుదుమారం రేపారు. సీఎం జగన్ అంటే అభిమానం అంటూనే తన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను తప్పుబడుతూ వచ్చారు. సినిమా టికెట్ ధరలు నిర్ణయించడానికి మీరెవరూ అంటూ ఫైర్ అయ్యాడు. ఈ క్రమంలోనే మంత్రి కొడాలి నానితో కూడా వర్మ మాటల యుద్ధాన్ని ప్రకటించాడు. దీంతో తనకు నేచురల్ స్టార్ నాని తప్పా ఈ కొడాలి నాని అంటే ఎవరో తెలీదని వర్మ ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు. దీనిపై స్పందించిన మంత్రి నేనేంటో తెలిసేలా చేస్తానని ప్రకటించాడు. తాజాగా నాని తన పంతం నెగ్గించుకున్నట్టు తెలుస్తోంది. ఉన్నట్టుండి వర్మ కొడాలి నాని ప్రశంసలతో ముంచెత్తాడు. […]