https://oktelugu.com/

Sankranti Akumanam : ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రెస్ మీట్లో దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలపై వెంకటేష్ షాకింగ్ కామెంట్స్..అతనితో నాకు సంబంధం లేదంటూ ఫైర్!

ఈ సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాలలో విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ హిట్టై భారీ వసూళ్లను రాబడుతూ సంక్రాంతి విజేతగా నిల్చిన సంగతి తెలిసిందే.

Written By: , Updated On : January 23, 2025 / 04:27 PM IST
Venkatesh

Venkatesh

Follow us on

Sankranti Akumanam : ఈ సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాలలో విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ హిట్టై భారీ వసూళ్లను రాబడుతూ సంక్రాంతి విజేతగా నిల్చిన సంగతి తెలిసిందే. మొదటి వారం పూర్తి కాకముందే వంద కోట్ల రూపాయలకు పైగా షేర్, 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్ల మైల్ స్టోన్స్ ని దాటి సంచలనం సృష్టించిన ఈ సినిమా, ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ 300 కోట్ల రూపాయిల గ్రాస్ వైపు అడుగులు వేస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు పై ఐటీ అధికారులు గత మూడు రోజుల నుండి సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అయితే సినిమా సక్సెస్ అయిన సందర్భంగా విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కలిసి నేడు ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు.

దిల్ రాజు ప్రస్తుతం ఐటీ అధికారుల ఆదీనం లో ఉండడంతో ఆయన ఈ ప్రెస్ మీట్ లో పాల్గొనలేకపోయారు. విలెక్షరులు ప్రస్తుతం ఇండస్ట్రీ లోని ప్రముఖులపై ఐటీ సోదాలు నిర్వహిస్తున్న సందర్భాన్ని వెంకటేష్ ముందు ప్రస్తావిస్తూ ‘స్టార్ హీరోలు భారీ ఎత్తున రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం వల్లే మేము బ్లాక్ మనీ చేయాల్సి వస్తుంది. హీరోలు బ్లాక్ అడగకుంటే ఇదంతా ఉండేది కాదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. దీనిపై మీ స్పందన ఏమిటి?’ అని వెంకటేష్ ని అడగగా, దానికి ఆయన సమాధానం చెప్తూ ‘మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు కానీ, నేను మాత్రం తీసుకునేది వైట్ మనీ నే. అది కూడా చాలా తక్కువ. నిర్మాతలు ఎంత ఇస్తే అంత తీసుకుంటా. నాకు ఇంత రెమ్యూనరేషన్ కావలని ఇప్పటి వరకు డిమాండ్ చేసింది లేదు’ అంటూ చెప్పుకొచ్చారు.

అదే విధంగా ప్రస్తుతం పోస్టర్స్ పై టాలీవుడ్ లో నడుస్తున్న వివాదాలపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు డైరెక్టర్ అనిల్ రావిపూడి సమాధానం ఇస్తూ ‘మిగతా పోస్టర్స్ గురించి నాకు తెలియదు కానీ, మా సినిమా పోస్టర్స్ మీద వేస్తున్న కలెక్షన్స్ మాత్రం పర్ఫెక్ట్. ప్రతీ రూపాయి ప్రేక్షకుల డబ్బులు నుండి వచ్చినవే. వాస్తవానికి అయితే కలెక్షన్స్ ని అలా చెప్పుకోకూడదు, కానీ ఎందుకు చెప్తున్నామంటే ఈ జానర్ సినిమాలకు ఇంత బలం ఉందని జనాలకు చెప్పడానికే. ఈ సినిమాకి వస్తున్న వసూళ్లు చూసి మేకర్స్ ఈ జానర్ పై మరిన్ని సినిమాలను చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అందుకే మేము వచ్చిన ప్రతీ పైసా ని ప్రేక్షకులకు చూపిస్తున్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి. ఈ ప్రెస్ మీట్ లో వెంకటేష్, అనిల్ రావిపూడి తో పాటుగా నిర్మాతలలో ఒకరైన శిరీష్ కూడా పాల్గొన్నాడు. త్వరలోనే సీక్వెల్ కి సంబంధించిన షూటింగ్ ని కూడా మొదలు పెట్టబోతున్నారు మేకర్స్.