AP Tourism
AP Tourism: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా పర్యాటక అభివృద్ధి పై( Tourism Development) దృష్టి సారించింది. తద్వారా ఆదాయంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని భావిస్తోంది. రాష్ట్రంలో నదులు, నది తీరప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని చూస్తోంది. ఆయా ప్రాంతాల్లో సకల సౌకర్యాలతో పాటు పర్యాటక పోట్లను సిద్ధం చేస్తోంది. కేరళలోని అలెప్పిలో బోటు షికారు తరహాలో.. ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రైవేట్ రంగంలో ఈ పర్యటక బోట్లను ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఏపీలో పర్యాటక రంగానికి నూతన ఉత్సాహం తీసుకురావడానికి ఏపీ టూరిజం ధనవంతు ప్రయత్నాల్లో ఉంది. అదే జరిగితే నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు మెరుగు పడనున్నాయి.
* ఆ నదుల పరివాహక ప్రాంతాల్లో
రాష్ట్రవ్యాప్తంగా 25 వరకు నదులు( rivers ) ఉన్నాయి. ప్రధానంగా కృష్ణ, గోదావరి, పెన్నా, నాగావళి, వంశధార తదితర నదుల్లో బోటు షికారు ఏర్పాటు చేయాలని ఏపీ టూరిజం డెవలప్మెంట్ సంస్థ తండర్లను ఆహ్వానిస్తోంది. ప్రస్తుతం అయితే రాష్ట్రంలో ఐదుచోట్ల ఇటువంటి ఓట్లను నడపాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కోనసీమ జిల్లా దిండిలో రెండు చోట్ల బోట్లను ప్రారంభించింది. గోదావరి వశిష్ట పాయలో పగటి వేళల్లో బోట్లు తిప్పుతున్నారు. సాయంత్రం 6 గంటల తరువాత హరిత రిసార్ట్ వద్ద నిలిపివేసి.. రాత్రిపూట బస చేయడానికి కేవలం ఒక బోటును వినియోగిస్తున్నారు. అయితే కొత్తగా ప్రవేశపెట్టి బోట్లలో కొన్నింటిని రాత్రి కూడా నడపాలని అధికారులు నిర్ణయించారు.
* సకల సౌకర్యాలతో
అయితే ఈ బోట్లలో( boats ) సకల సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. ఉండడానికి గదులు, రెస్టారెంట్, వినోద కార్యక్రమాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి తగినట్టు ప్యాకేజీలు సైతం రూపొందిస్తున్నారు. విజయవాడ భవానీ ద్వీపం నుంచి కృష్ణ, గోదావరి పవిత్ర సంగమం వరకు కొత్తగా మరో బోటును నడపనున్నారు. పాపికొండలకు వెళ్లే పర్యాటకులకు ఒకటి రెండు రోజులు పాటు బోట్ లోనే ఉండేలా.. ఏర్పాట్లు చేస్తున్నారు. కోనసీమ జిల్లా సముద్ర తీర ప్రాంతం అంతర్వేది నుంచి ఒక బోటును నడపనున్నారు. అయితే పగలు రాత్రి అందులోనే ఉండేలా ప్యాకేజీలను రూపొందించనున్నారు.
* గండికోట ప్రాంతంలో
వైయస్సార్ కడప( Kadapa district ) జిల్లాలో గండికోట ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అక్కడ రాత్రిపూట చూసేందుకు ఎంతో బాగుంటుంది. అందుకే అక్కడ ఓటు నడిపే విధంగా చర్యలు తీసుకున్నారు. అందులో రాత్రి విడిది కూడా ఏర్పాటు చేశారు. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలోని తాజంగి జలాశయంలో బోటు నడపనున్నారు. అరకు తో పాటు లంబసింగి సందర్శనకు వెళ్లే వారంతా ఈ బోటు సేవలను వినియోగించుకోనున్నారు. అందుకు తగ్గట్టుగా ప్యాకేజీలు సైతం రూపొందించారు. మొత్తానికి అయితే ఏపీవ్యాప్తంగా కేరళ తరహాలో పర్యాటక బోట్లు ఏర్పాటు అవుతుండడం శుభ పరిణామం.