ఇంతకీ నారప్ప బృందం నుండి వచ్చిన మెసేజ్ ఏమిటంటే.. ‘‘నారప్ప’ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు, అభిమానులు అందరికీ మనవి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనందరి ఆరోగ్యం, రక్షణ దృష్టిలో ఉంచుకుని చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నాం. పరిస్థితులు చక్కబడిన తర్వాత అతి త్వరలోనే ఈ చిత్రాన్ని మీ ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఈ మహమ్మారి వీలైనంత తొందరగా దూరం కావాలని, అందరూ క్షేమంగా ఉండాలని ఈ సినిమా కోసం ఇష్టం, అంకితభావంతోనూ పనిచేసిన ప్రతిఒక్కరం కోరుకుంటున్నాం.
ఇళ్లలోనే ఉండి మనపట్ల, మన కుటుంబసభ్యుల పట్ల అప్రమత్తంగా ఉందాం. ఈ క్లిష్ట పరిస్థితిని అందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం. అందరూ మాస్కులు ధరించి, దూరాన్ని పాటిస్తూ ఎవరికి వారు జాగ్రత్తగా ఉండటమే మనం పొరుగువారికీ, సమాజానికీ చేసే గొప్ప సాయం. త్వరలోనే మీ ముందుకు వచ్చి మిమ్మల్నిందర్నీ అలరించాలని కోరుకుంటూ ‘నారప్ప’ టీమ్’ అంటూ ఈ పోస్ట్ ను పోస్ట్ చేశారు వెంకటేష్.
ఏది ఏమైనా కరోనా సెకండ్ వేవ్ కూడా సినీ పరిశ్రమను పెద్ద దెబ్బే కొట్టింది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన నాగచైతన్య ‘లవ్ స్టోరీ’, దగ్గుబాటి రానా ‘విరాటపర్వం’ , చిరంజీవి ‘ఆచార్య’, కంగనా తలైవి, కపిల్ దేవ్ బయోపిక్, అలాగే మరికొన్ని చిన్నాచితకా చిత్రాలు, అలాగే షూటింగ్ లో ఉన్న అఖండ, రాదే శ్యామ్, ప్రభాస్ మిగిలిన రెండు సినిమాలు, అన్నిటికిమించి ఆర్ఆర్ఆర్ ఇలా పరిశ్రమలోని భారీ సినిమాల అన్నిటి పై కరోనా సెకెండ్ వేవ్ బాగా ప్రభావం చూపే అవకాశం ఉంది.