కేంద్ర సెన్సార్ బోర్డు అడ్వైసరి కమిటీ సభ్యుడిగా జైరాం దేశిరాజుని నియమిస్తూ కేంద్ర ఇన్ఫర్మేషన్ & బ్రాడికాస్టింగ్ కార్యదర్శి విజయగోపాల్ ఆదేశాలు జారీచేశారు.
గత 35 సంవత్సరాలుగా నటుడిగా తన కెరీర్ కొనసాగిస్తూ రియల్ స్టార్ హీరో శ్రీహరికి అత్యంత సన్నిహితుడుగా జైరాం దేశిరాజు ఉన్నారు.శ్రీహరితో ‘శివాజీ’ ‘ఒరేయ్ తమ్ముడు’ లాంటి చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా జైరాం వ్యవహరించారు.
ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు.నిర్మాతగా కూడా అనుభవం ఉన్నందున ముందు ముందు మంచి అభిరుచి గల చిత్రాలు నిర్మిస్తూ నిర్మాతగా కూడా ఎదగాలని ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే ‘విజయ గణపతి ఫిలిమ్స్’ పేరుతో బ్యానర్ ని కూడా పెట్టబోతున్నట్లుగా జైరాం దేశిరాజు తెలిపారు. క్యారెక్టర్ఆర్టిస్ట్ గా నిర్మాతగా అటు చిత్రపరిశ్రమలోని వారికీ ఇటు ప్రేక్షకులకి జైరాం దేశిరాజు సుపరిచుతులు.
కేంద్ర సెన్సార్ బోర్డు తాజాగా జైరాంకు కీలక పదవి కట్టబెట్టింది. రెండేళ్లపాటు సెన్సార్ బోర్డు సభ్యునిగా జైరాం కొనసాగనున్నారు. ఈ సందర్భంగా జైరాం మాట్లాడుతూ తనకి కేటాయించిన పదవి బాధ్యతలను చిత్తశుద్ధి తో నిర్వహిస్తానని తెలిపారు. యువతకు దిశానిర్దేశం చేసేవి , కుటుంబ సభ్యులతో కలిసి చూసే చిత్రాలకు ప్రాధాన్యమిస్తానని ఆయన తెలిపారు.